నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు
దర్శకత్వం: ఆద్యంత్ హర్ష
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
సంగీతం: ఎబినేజర్ పాల్(ఎబ్బి)
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
ఎడిటర్: రామ్ తూము
విడుదల తేది: ఆగస్ట్ 2, 2024

వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల ఎమ్3 మీడియా పతాకం పై మహా మూవీస్ తో కలిసి నిర్మించిన చిత్రం “విరాజి”.రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు నటించిన ఈ సినిమా భారీ పోటీ నడుమ ఈరోజే విడుదల కాగా ఈ చిత్రం ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ: ఓ పీచాసుపత్రి నేపథ్యంలో ఓ పది మంది వ్యక్తులు వివిధ కారణాలతో అక్కడికి వచ్చి, అక్కడినుంచి బయటకు వెళ్ళలేఖ, ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతుంటారు. ఈవెంట్ పేరుతో తమను మూసివేయ బడ్డ ఆ పిచ్చాసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తారు.
ఆ టైంలో వరుణ్ సందేశ్ కూడా మిగతా వారి లాగే ఆ పిచ్చాసుపత్రి లోకి వస్తాడు. వరుణ్ సందేశ్
వచ్చిన తర్వాత ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పదిమందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఎవరు? చివరకు ఆ ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి ఎవరైనా బయటపడ్డారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: ఆండీ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తో వరుణ్ సందేశ్ నటన చాలా మెరుగయింది. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం: ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు. డైరెక్టర్ మంచి కథ రాసుకున్నాడు. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో సాగిన కథనం సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులతో ఆకట్టుకునేలా ముందుకు తీసుకు వెళ్ళాడు డైరెక్టర్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా రాసుకున్నారు. ఇక నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది.

రేటింగ్: 3.5/5