IPL 2025: వచ్చే ఐపీఎల్ వేలంపై ఫ్రాంచైజీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. నిజానికి ఈ ఏడాది ఆఖరిలో వేలం నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఫ్రాంచైజీలు ఆక్షన్ కు సిద్ధంగా లేనట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పది ఫ్రాంచైజీల యాజమాన్యాలతో బీసీసీఐ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. కానీ మీటింగ్ లో ఎలాంటి క్లారిటీ రాలేదని చర్చ జరుగుతోంది. ఆక్షన్, రిటెన్షన్, ఇంపాక్ట్ రోల్ పై ఎక్కువగా చర్చ జరిగినట్టు టాక్ వినిపిస్తోంది. మెగా వేలం నిర్వహిస్తే జట్ల రూపురేఖలు మారిపోతాయి. కానీ ఎంతమంది ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలి అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదు.
IPL 2025 Clashes between Shah Rukh, Preity IPL 2025 Canceled
ఇదే అంశంపై హాట్ హాట్ గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మెగా వేలాన్ని కోల్కత్తా నైట్ రైడర్స్ షారుక్ ఖాన్ నిర్వహించారని ప్రచారం జరుగుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా షారుక్ ఖాన్ కు మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. షారుక్ ఖాన్ ఎక్కువమందిని రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా కథనాలు వస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ సహా యజమాని నెస్వాడియా మాత్రం అవసరం లేదని వాదించినట్టుగా ప్రచారం జరుగుతోంది. మెగా వేలం నిర్వహించాలని నెస్వాడియా కోరినట్లు తెలుస్తోంది.
Also Read: Surya Kumar Yadav: ఐపీఎల్ 2025 లో సూర్యకు 100 కోట్లు ఆఫర్ ?
ఎనిమిది మంది ఆటగాళ్లను అట్టి పెట్టుకునే అవకాశం ఇవ్వాలని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కోరినట్టుగాను సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. విదేశీ ప్లేయర్ల కోటాలో అదనంగా మరికొంతమందిని అట్టిపెట్టుకునే అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రతి ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను అట్టి పెట్టుకునే ఛాన్స్ ఉంటుందని…. కథనాలు వచ్చాయి. అలాగే ప్రతి జట్టులోను నలుగురు మినహా అందరూ వేలానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
అసలు వేలం నిర్వహిస్తారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. వేలం నిర్వహించకూడదు అనుకుంటే రిటెన్షన్ గురించి ప్రస్తావనే ఉండదు. ఐపీఎల్ లో గతేడాదే ఇంపాక్ట్ రోల్ ను తీసుకువచ్చారు. దీనివల్ల కొత్త వారికి అవకాశాలు దొరికాయి. కానీ ఆల్ రౌండర్లకు ప్రయారిటీ తగ్గుతుందనే వాదన వినిపించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ కూడా ఇంపాక్ట్ రోల్ పై అప్పట్లో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు కొన్ని ఫ్రాంచైజీలు ఇంపాక్ట్ రోల్ ఉండడం బెటర్ అని వాదించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా వేలంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.