Hyper Aadi: Roja is the reason why I am at this level not Pawan

Hyper Aadi: జబర్దస్త్ ద్వారా చాలా ఫేమస్ అయిన హైపర్ ఆది తన మాటలతో ఎదుటివారు ఎంత పెద్ద హీరో డైరెక్టర్ అయినా కూడా ఇరుకున పెట్టేస్తారు. ఎవరైనా సరే మాట్లాడే ప్రతి మాటకు ఒక పంచ్ వేస్తూ చాలా ఫేమస్ అయ్యారు.అయితే అలాంటి హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈసారి జరిగిన ఏపీ ఎన్నికల్లో హైపర్ ఆది,పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేశారు.ఇదే నేపథ్యంలో చాలామంది జబర్దస్త్ కంటెస్టెంట్లు రోజాని వ్యతిరేకిస్తూ రోజాని నిందిస్తూ మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

Hyper Aadi: Roja is the reason why I am at this level not Pawan

ఇందులో కిరాక్ ఆర్పీ అయితే మరీ ఘోరంగా రోజాని నీచాతి నీచంగా తిట్టారు.ఇక హైపర్ ఆది వ్యక్తిగతంగా ఏం నిందించలేదు.కానీ మెగా ఫ్యామిలీకి మాత్రం సపోర్ట్ ఇస్తూ జనసేన పార్టీ తరఫున ప్రచారం చేశారు.అయితే పవన్ కళ్యాణ్ కి ఏపీ ఎన్నికల్లో సపోర్ట్ చేసిన హైపర్ ఆది నేను ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారణం రోజు అని చెప్పడం ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.(Hyper Aadi)

Also Read: Lavanya: రాజ్ తరుణ్ నన్ను మాత్రమే కాదు ఆమెని కూడా ప్రెగ్నెంట్ చేశాడు..?

అంతేకాదు చాలామంది హైపర్ ఆది మాటలు విని మిమ్మల్ని ఈ రేంజ్ కి తీసుకొచ్చిన రోజుని వదిలేసి ఆయనకి ఎలా సపోర్ట్ చేస్తారు అని మాట్లాడుకుంటున్నారు.అయితే ఇదే విషయం గురించి ఓ చిట్ చాట్ లో హైపర్ ఆదిని అడగగా నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.అందుకే ఆయనకు సపోర్ట్ చేశాను. కానీ రోజాను నిందించలేదు. రోజాకి జగన్ అంటే ఇష్టం నాకు పవన్ అంటే ఇష్టం ఎవరి ఇష్టం వారిది.

Hyper Aadi: Roja is the reason why I am at this level not Pawan

నేను పదవుల కోసం ప్రచారం చేయలేదు. కేవలం ఆయన మీద ఉన్న అభిమానంతోనే ప్రచారం చేశాను. జనసేన పార్టీకి సపోర్ట్ చేశాను కానీ జబర్దస్త్ జడ్జిగా నాకు ఎప్పటికీ రోజా గారు అంటే అభిమానమే.రోజా గారి మీద ఎప్పటికీ గౌరవం ఉంటుంది. నాలాంటి ఎంతోమందికి ఇండస్ట్రీలో ఇంత గుర్తింపు వచ్చింది అంటే దానికి ప్రధాన కారణం రోజా గారే.నేను ఇంతటి స్థాయికి రావడానికి కారణం ఆమెనే.. ఆమె అంటే నాకు ఎప్పటికీ రెస్పెక్ట్ ఉంటుంది అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చారు.(Hyper Aadi)