Who is the heroine who insulted Nagarjuna

Nagarjuna: అక్కినేని నాగేశ్వరావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి విక్రమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున మొదటి సినిమాతోనే హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఈయన చేసిన శివ,కిరాయి దాదా, గీతాంజలి వంటి ఎన్నో సినిమాలు ఈయనలో ఉన్న క్లాస్ మాస్ ని బయటపెట్టాయి. అంతేకాదు నాగార్జున నటనకి చాలామంది ఫిదా అయిపోయారు. అలా నాగార్జున 60 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో అని చెప్పవచ్చు.

Who is the heroine who insulted Nagarjuna

అయితే అలాంటి ఈ పెద్ద హీరోని బూతులు తిట్టిన హీరోయిన్ ఎవరు.. ఎందుకు అలాంటి బూతులు తిట్టింది అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున బూతులు తిట్టిన హీరోయిన్ ఎవరో కాదు నటి కుష్బూ.. నాగార్జున,కుష్బూ కాంబినేషన్లో కిరాయి దాదా, కెప్టెన్ నాగార్జున వంటి సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాల్లో నటించే సమయంలో కుష్బూకి అంతగా తెలుగు రాదట. అయితే ఈ విషయం తెలుసుకున్న షూటింగ్ సెట్ లోని ఓ వ్యక్తి మీకు తెలుగు నేర్పిస్తాను అని చెప్పి కుష్బూ చేత ఓ బూతు మాటలు నేర్పించారట. (Nagarjuna)

Also Read: Hyper Aadi: నేను ఇంతటి స్థాయిలో ఉండడానికి పవన్ కాదు రోజా కారణం..!

దీనికి అర్థం తెలుగులో గుడ్ మార్నింగ్ అని అబద్ధం చెప్పారట. దాంతో తెలుగు రాని కుష్బూ అది నిజమేనని నమ్మి ఏవిఎం స్టూడియోలోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జునని ఆ బూతు పదంతో పలకరించిందట.దాంతో ఆ పదం విన్న నాగార్జున కుష్బూని వెంబడించారట. అయితే తాను అన్న పదం బూతు పదం అని తెలుసుకున్న కుష్బూ నాగార్జున కి దొరకకుండా తప్పించుకొని ఏవిఎం స్టూడియో బయటకు వచ్చేసిందట.

Who is the heroine who insulted Nagarjuna

ఆ తర్వాత నాగార్జున పట్టుకుని అసలు విషయం అడగగా.. నాకు తెలుగు సరిగ్గా రాదు.కానీ షూటింగ్ సెట్ లోని ఓ వ్యక్తి తెలుగు నేర్పిస్తానని చెప్పి ఈ పదం నేర్పించారు. అందుకే మీరు రావడంతోనే నేను అలా పలకరించాను అని అన్నారట. ఇక ఈ విషయానికి నవ్వుకున్న నాగార్జున ఆ తర్వాత అది ఎంత పెద్ద బూతు పదమో చెప్పి ఈ పదం ఇంకొకసారి ఉపయోగించకు అని అన్నారట.(Nagarjuna)