Bajaj CNG Bike: ఇండియన్ మార్కెట్లో… ఎలాంటి బైక్ అయినా ఇట్టే విక్రయాలు జరుపుకుంటున్నాయి. దీనికి తగ్గట్టుగానే రకరకాల వాహనాలు మన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. అయితే.. దేశవ్యాప్తంగా పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మోడీ ప్రభుత్వం లోనే ఈ ధరలు పెరగడం మనం చూశాం. లీటర్ పెట్రోల్ అలాగే డీజిల్ ధరలు 100 రూపాయలు దాటిపోయాయి. Bajaj CNG Bike
Bajaj CNG bike spotted testing before the official launch
ఇక పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో జనాలు కూడా చాలా కొత్తగా ఆలోచిస్తూ ఎలక్ట్రిక్ అలాగే సీఎన్జీ వాహనాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలకు అటు సీఎన్జీ వాహనాలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. ఈ తరుణంలోనే ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త సిఎన్జి బైక్ రాబోతుందని తెలుస్తోంది. Bajaj CNG Bike
Also Read: Oben Rorr E-bike: మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైక్.. రూ.40 వేల డిస్కౌంట్ ?
బజాజ్ కంపెనీ నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ మార్కెట్ లోకి రాబోతున్నట్లు సమాచారం. బజాజ్ ఆటో కంపెనీ బ్రజర్ పేరుతో సిఎన్జి బైక్ను ఆవిష్కరిస్తుంది. ఈ బైకు సిఎన్జి తో పాటు పెట్రోల్ ద్వారా కూడా మనం నడిపించవచ్చు. రెండు విధాల వాడుకునేందుకు అణువుగా ఈ బైక్ ను రూపొందిస్తున్నారు. Bajaj CNG Bike
ఇక ఈ బైక్ 110 నుంచి 150 సీసీ ఇంజన్ ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అంటే దాదాపుగా 125 సీసీ ఇంజన్ తో రూపొంది ఛాన్స్ ఉంది. ఇక ఈ బైక్ వచ్చేనెల అంటే జులై 5వ తేదీన మార్కెట్లోకి లాంచ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బజాజ్ కంపెనీ. దీంతో బజాజ్ బైక్స్ కొనుగోలు చేసేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Bajaj CNG Bike