Ms Dhoni: జోగిందర్ శర్మ 2007 టీ20 వరల్డ్ కప్ అనగానే గుర్తుకు వచ్చే పేరు. ఎందుకంటే అప్పట్లో ఆఖరి ఓవర్ హీరో జోగిందర్ శర్మ. టీ20 వరల్డ్ కప్ తర్వాత జోగిందర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో క్రికెట్ కు దూరమయ్యారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. అందుకు గల కారణం ధోనిని అతడు కలవడమే. ధోనితో కలిసి ఉన్న వీడియోను జోగిందర్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. చాలాకాలం తర్వాత ధోనీని కలిసానని పోస్ట్ పెట్టాడు. ఇది ఒక ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పుకొచ్చాడు. 12 ఏళ్ల తర్వాత మేమిద్దరం కలుసుకున్నామని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. Ms Dhoni

Mahendra Singh Dhoni into Police Department

ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదే సమయంలో జోగిందర్ శర్మ గురించి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ హర్యానాలో డీఎస్పీగా పనిచేస్తున్నారు. నిజానికి 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు జోగిందర్ గురించి పెద్దగా చర్చలేదు. అయితే ఫైనల్ లో మాత్రం కెప్టెన్ ధోనీ నమ్మకాన్ని ఈ ప్లేయర్ నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే (జోహాన్నెస్) బర్గ్ లో టీ20 వరల్డ్ కప్ జరిగింది. టైటిల్ పోరులో భారత్, పాకిస్తాన్ తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. Ms Dhoni

Also Read: Surya Kumar Yadav: ఐపీఎల్ 2025 లో సూర్యకు 100 కోట్లు ఆఫర్ ?

ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ఆత్మవిశ్వాసంతో చేజింగ్ ను మొదలుపెట్టింది. 19వ ఓవర్ వరకు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడింది. ఆఖరి ఓవర్లో పాకిస్తాన్ కు 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్ లో మిస్ బా ఉల్హాక్, మహమ్మద్ ఆసిఫ్ ఉన్నారు. ఆఖరి వికెట్ అయినా మిస్ బా ఉల్హక్, మహమ్మద్ ఆసిఫ్ ను ఆపడం అంత సులభమైన పనికాదు. చివరి ఓవర్లో బౌలింగ్ చేయడం తేలికైన వ్యవహారం ఏమికాదు. తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అప్పుడు ఎవరు బౌలింగ్ చేస్తారా అని అభిమానులు ఆలోచిస్తూ ఉండగానే జోగిందర్ కు మహీ బంతిని అప్పగించాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. Ms Dhoni

మిస్ బాను ఆపడం జోగిందర్ వల్ల అవుతుందా అని చర్చించుకున్నారు. అంతలోనే తొలి బంతిని జోగిందర్ వైడ్ గా వేశాడు. ఆ తర్వాత వేసిన బంతికి పరుగులు ఏమి ఇవ్వలేదు. ఆ వెంటనే రెండో బంతిని మిస్ బా సిక్సర్ గా మార్చాడు. నాలుగు బంతుల్లో ఆరు పరుగులకు ఈక్వేషన్ మారింది. టీమిండియా ఓటమి ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే జోగిందర్ తెలివిగా బంతిని సంధించాడు. దీంతో టీమ్ ఇండియా సంబరాల్లో మునిగిపోయింది. తొలి టీ20 వరల్డ్ కప్ భారత్ ఖాతాలో పడిపోయింది. రాత్రికి రాత్రే జోగిందర్ శర్మ హీరో అయ్యాడు. అభిమానుల మనసులను దోచుకున్నాడు. ఇప్పుడు మహిని కలిసి మరోసారి అందరి దృష్టిలో పడ్డారు. Ms Dhoni