Sunil shocking comments before Chiranjeevi

Sunil: మెగాస్టార్ సునీల్ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.చిరంజీవి చేసిన చాలా సినిమాల్లో సునీల్ కమెడియన్ పాత్రల్లో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అలాంటి కమెడియన్ సునీల్ ఏకంగా చిరంజీవి ముందే మీకంటే ఆ హీరో చాలా బెటర్ అంటూ మాట్లాడారట.మరి దానికి చిరంజీవి రియాక్షన్ ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.

Sunil shocking comments before Chiranjeevi

సునీల్,చిరంజీవి ముందు మరో హీరోని పొగిడింది ఎవరినో కాదు స్వయానా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నే. అయితే మగధీర సినిమా ఈవెంట్లో సునీల్ రామ్ చరణ్ డాన్స్ గురించి మాట్లాడుతూ.. అన్నయ్య ఈ సినిమాలో చరణ్ మీ డ్యాన్స్ ని మించిపోయారు. చించి ఆరేసారు అంటూ స్టేజ్ మీద అందరి ముందే సంబరపడుతూ సునీల్ చెప్పారు. (Sunil)

Also Read: Chiranjeevi: అమ్మాయిల మోజులో పడి తమ్ముడిని చావు బతుకుల్లో వదిలేసిన చిరంజీవి.?

ఇక సునీల్ మాటలకు అక్కడే కుర్చీలో కూర్చున్న చిరంజీవి ఆనందోత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆ సినిమా ఈవెంట్లో సునీల్ మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Sunil shocking comments before Chiranjeevi

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి 100 కోట్లు సాధించిన ఏకైక తెలుగు సినిమాగా మగధీర పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా మగధీర సినిమా విడుదలై ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలోని బంగారు కోడిపెట్ట అనే పాటలో ముమైత్ ఖాన్, రామ్ చరణ్ లు డాన్స్ చేశారు..(Sunil)