Mohammed Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ప్రపంచకప్ 2023 తర్వాత ఆటకు దూరమయ్యారు. చివరిసారిగా 2023 నవంబర్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అతని కాలికి గాయమైంది. 2024 ఫిబ్రవరిలో చీలమండ గాయానికి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయింది. ప్రస్తుతం షమీ జాతీయ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. Mohammed Shami
Mohammed Shami provides big update on comeback from injury
అతను టీమిండియాలోకి ఎప్పుడు పునరాగమనం చేస్తాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే పునరాగమనంపై మహమ్మద్ షమీ స్వయంగా కీలక ప్రకటన చేశాడు. ప్రపంచకప్ తర్వాత గాయపడి ఇటీవలే కోలుకున్న ఈ సీనియర్ పేసర్ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టాడు. దీనిలో భాగంగా జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు. అయితే టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలంటే ఎవరైనా సరే దేశవాలీ క్రికెట్ ఆడాల్సిందేనని ఇటీవలే బీసీసీఐ రూల్ పెట్టింది. Mohammed Shami
Also Read: Ms Dhoni: పోలీస్ డిపార్ట్మెంట్ లోకి మహేంద్ర సింగ్ ధోని..?
కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంలో ఏ మాత్రం రాజీ పడడం లేదు. దీంతో షమీ సైతం బీసీసీఐ కొత్త నిబంధనకు ఓకే చెబుతూ దేశవాళి క్రికెట్ ఆడబోతున్నాడు. పశ్చిమ బెంగాల్ తరఫున ఆడేందుకు సిద్ధమని ప్రకటించాడు. తాను ఎప్పుడు జాతీయ జట్టులోకి వస్తానో చెప్పడం కష్టమని షమీ వ్యాఖ్యానించారు. జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు చెప్పాడు. అయితే జాతీయ జట్టు కన్నా ముందు బెంగాల్ తరఫున ఆడతనని స్పష్టం చేశారు. Mohammed Shami
పూర్తిస్థాయిలో సన్నద్ధం అయ్యేందుకు రెండు లేదా మూడు మ్యాచ్లు ఆడతానని ప్రకటించాడు. వన్డే ప్రపంచకప్ సమయంలో అయిన గాయం తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేకపోయినట్టుగా గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ ఆడి టీ20 వరల్డ్ కప్ కు రెడీ అవుతానని అనుకున్న సమయంలో గాయం సర్జరీ వరకు వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చింది అన్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫిట్నెస్ కోసం శ్రమిస్తున్నట్లు వెల్లడించాడు. Mohammed Shami