Double ismart movie ram pothineni speech

Double Ismart: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ‘డబల్ ఇస్మార్ట్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదలవుతున్న ఈ చిత్రం యొక్క టైలర్ నిన్న విడుదల కాగా ఎప్పటినుంచో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా కావడం విశేషం. ఇక అభిమానులు ఈ సినిమా పట్ల ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మంచి నటుడిగా, డాన్సర్ గా, ఆటిట్యూడ్ ఉన్న హీరోగా ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు రామ్.

Double ismart movie ram pothineni speech

ఆయన కెరియర్ గాడి తప్పుతున్న సమయంలో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరొకసారి రామ్ ను హీరోగా నిలబెట్టింది. ఇప్పుడు అదే సినిమా యొక్క సీక్వెల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రామ్ ఈ చిత్రాన్ని ఏ విధంగా విజయం అందుకుంటారో చూడాలి. పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు తో సినిమా చేయాలని హీరోలు అప్పట్లో అనుకునేవారు కానీ పూరీ జగన్నాథ్ ట్రెండ్ కు తగ్గ సినిమాలు చేయకపోవడం, భారీ ఫ్లాప్ లు ఇవ్వడం, అవుట్ డేటెడ్ సినిమాలు చేయడం వంటివి జరగడంతో ఆయన సినిమాలకు ఇప్పుడు పెద్దగా డిమాండ్ ఉండడం లేదు.

Also Read: Prabhas: ప్రభాస్ కి ఆ హీరోయిన్ తో పెళ్లయిందా.. షాకింగ్ సీక్రెట్ రివీల్.?

సొంత ప్రొడక్షన్ లోనే ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో ఇది ఏ స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ కు కూడా పెద్దగా బజ్ రాలేదు. సినిమాపై బజ్ కూడా పెంచలేకపోయింది. ఆ విధంగా ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక టైలర్ లాంచ్ వైజాగ్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ లాంచ్ లో రామ్ మాటలు పెద్దగా ఉత్సాహం లేకపోవడం వంటివి చూస్తుంటే సినిమా పట్ల నిరాశగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి పూరి జగన్నాథ్ ను నమ్మిన రామ్ కు ఈ సినిమా ద్వారా ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.