Vijay deverakonda lineup of tollywood movies

VD12: సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈసారి చేసే సినిమా తప్పకుండా విజయం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. అందుకే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఈ సినిమా యొక్క షూటింగ్ 80% పూర్తయిందని చెబుతున్నారు.

Vijay deverakonda lineup of tollywood movies

వచ్చే ఏడాది మార్చి 28 న విడుదల కాబోతూ ఉండగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను కూడా ఏర్పరుచుకుంది. ఆ విధంగా ఈ సినిమా పట్ల విజయ్ దేవరకొండ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకోగా ఈ సినిమా తరువాత ఆయన చేయబోయే సినిమాల లైనప్ కూడా ఆయన రేంజ్ను మరింతగా పెంచే విధంగా ఉంది. తనకు టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడైన రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో మరొక సినిమాను చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. ఇందులో రష్మిక కథానాయకగా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Ravi Teja: అత్త మామ ఉండగా రవితేజ కాళ్లు కడిగి కన్యాదానం చేసిన నటుడు.. ఎవరంటే..?

రాయలసీమ నేపథ్యంలో 18 వ సెంచరీలో జరగబోతున్న ఈ సినిమా తప్పకుండా భారీ స్థాయి లో తెరకెక్కుతుంది అని చెబుతున్నారు. 150 కోట్ల పైచిలుకు బడ్జెట్ను ఈ చిత్రం కోసం ఖర్చు పెట్టబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ వారు. ఇక ఈ సినిమా తరువాత దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. పొలిటికల్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చాయి. మరి ఈ సినిమాల ద్వారా మళ్ళీ ఫాం లోకి వచ్చి టైర్ వన్ రేసులో ఈ హీరో నిలబడతాడా అనేది చూడాలి.