Chiranjeevi vishwambhara movie about vashishta

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘విశ్వంభర’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘బింబి సారా’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ ఇప్పుడు హైదరాబాదులోనే జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్ లను నిర్మించి ఈ చిత్రాన్ని కన్నుల విందుగా తయారు చేయబోతున్నారట. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో ఈ చిత్రానికి అవుట్డోర్ షూటింగ్ లు పెద్దగా లేవు.

Chiranjeevi vishwambhara movie about vashishta

అలాంటి వాటిని తొలి షెడ్యూల్ లోనే పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిందని చెబుతున్నారు. దర్శకుడు వశిష్ట కూడా దీనిని ధ్రువీకరించారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువగా ఉండడంతో పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయాన్ని తీసుకోబోతున్నారు. మొదటి నుంచి ఈ సినిమా పట్ల అంచనాలు వేరే స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమా యొక్క టీజర్ వచ్చిన దగ్గర నుంచి వేరే లెవల్ సినిమానే చేస్తున్నాడు అన్న ఫీలింగ్ అందరిలో కలిగింది.

Also Read: Double Ismart: రామ్ మాటల్లో నిరుత్సాహం.. పూరీ దెబ్బేసినాట్లేనా!!

జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి వంటి ఫాంటసీ టచ్ ఉన్న విజువల్ వండర్ సినిమాను చేయబోతున్నాడని చెబుతున్నారు దర్శకుడు వశిష్ట. అయన కూడా బింబిసారా లాంటి గొప్ప సినిమాను చేయడంతో ఈ సినిమా పట్ల అందరికీ నమ్మకం కుదిరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా హైపు మరింత పెరిగేలా మాట్లాడాడు దర్శకుడు. ఈ చిత్రం తప్పకుండా చిరంజీవి నటించిన సోషియా ఫాంటసీ సినిమాల్లో కెల్లా గొప్పగా ఉంటుంది అని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రాన్ని గొప్ప గా చెప్పే విధంగా ఉంటుందని కూడా చెప్పారు. అన్ని రకాలుగా ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో ఉండేలాగానే తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఆయన నటించిన టాప్ 5 సినిమాలలో ఇది కూడా ఒకటి ఉంటుంది అని చెప్పారు. ఈ మాటలతో మెగా అభిమానులలో ‘విశ్వంభర’ సినిమా మీద అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు.