Pawan kalyan finishing OG Movie First

Pawan Kalyan: పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో నటించాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఆయన మొదలుపెట్టిన ఈ సినిమాలకు ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు కానీ ఈ మూడు చిత్రాల నిర్మాతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. కోట్ల రూపాయలు ఈ సినిమాల కోసం వెచ్చించిన నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలలో బిజీగా ఉన్నారు.. మళ్ళీ సినిమాలు వచ్చి చేస్తారా లేదా అన్నది కూడా తెలియదు.

Pawan kalyan finishing OG Movie First

చాలా రోజుల తర్వాత ఆయనను ఇటీవల ఈ నిర్మాతలు సంప్రదించగా వీటిలో ఓ సినిమాను వెంటనే పూర్తి చేసేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించాలని తెలుస్తుంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒజీ’ సినిమాను వెంటనే పూర్తి చేసేందుకు ఆయన ఒప్పుకున్నారని తెలుస్తుంది. ఎన్నికలు లేకపోతే ఈ సినిమాను అక్టోబర్లో విడుదల చేయడానికి నిర్మాతలు నిశ్చయించుకున్నారు.. కానీ పవన్ కళ్యాణ్ గెలవడంతో ఈ సినిమా హోల్డ్ లో పడిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఓ ప్రమోషనల్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

Also Read: Ram Charan: ఆ విషయం లో తారక్ కంటే చరణే ముందున్నాడుగా!!

అయితే ఈ సినిమాను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం పట్ల ఇతర నిర్మాతలు కొంత నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది. చాలా రోజుల క్రితం మొదలైన హరి హరి వీరమల్లు సినిమాను పవన్ కళ్యాణ్ అసలు పట్టించుకోకపోవడం పట్ల ఆ నిర్మాత కాస్త ఆగ్రహం గా కూడా ఉన్నాడట. ఎన్నో రోజులుగా ఈ సినిమాను పక్కన పెడుతూ వచ్చారు పవన్. ఈ సినిమా మొదలుపెట్టిన తరువాత చేసిన చిత్రాలను విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాపై నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారో అని అడుగుతున్నారు.

అంతేకాదు మరొక సినిమా పట్ల కూడా పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం చేస్తున్నాడు. అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఈ సినిమాను కూడా పవన్ కళ్యాణ్ మొదలు పెట్టి ఫినిష్ చేయకపోవడం పట్ల ఆయన అభిమానులు ఎంతో నిరాశ పడుతున్నారు. మరి ఈ రెండు సినిమాలను కాకుండా పవన్ ‘ఓజి’ సినిమాని చేయడం వెనక అర్థం ఏమిటో అని కొంతమంది సినిమా విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా, పవన్ కళ్యాణ్ అభిమానులు ఏదైతే ఆశిస్తున్నారో అవన్నీ ఉన్న సినిమాగా తెరకెక్కిస్తున్నారు.