Janhvi kapoor grand entry into tollywood

Janhvi Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హిందీ ప్రేక్షకులను తన అంద చందాలతో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగువారిని కూడా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతుంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవలే ఆమె దేవర చిత్రంలో చేసిన ఓ పాట ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ పాటలో జాన్వీ ని, ఆమె అందాలను చూస్తుంటే ప్రేక్షకులకు మతి పోవడం ఖాయం అనే చెప్పాలి.

Janhvi kapoor grand entry into tollywood

ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు సన్నని హీరోయిన్ అందాలతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బొద్దు అందాలను తెలుగు ప్రేక్షకులు చూసి చాలా రోజులై అయిపోయిందని చెప్పాలి. ఆ విధంగా అనుష్క తర్వాత బొద్దు అందాలను తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు. ఎన్టీఆర్ సరసన ఈ ముద్దుగుమ్మ ఆడి పాడడం చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవిలు గుర్తొస్తున్నారని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Pawan Kalyan: పవన్ కు ఆ సినిమా పైనే ఇంత ప్రేమిందుకు?

ఏదేమైనా తెలుగువారికి అందాల విందు చేయడానికి ఈ హీరోయిన్ దిగి వచ్చిందని చెప్పాలి. అనిరుద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా హీరోయిన్ ను అందంగా చూపించడంలో కొరటాల శివకు ప్రత్యేక శైలి ఉంది. ఇప్పటిదాకా ఆయన సినిమాలలో హీరోయిన్ లను చాలా అందంగా చూపించి వారి కెరీర్ లో మరిన్ని సినిమాలు అందుకునే విధంగా చేశారు. అలా కొరటాల శివ దర్శకత్వంలో మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ కు ఛాన్స్ ఇవ్వగా ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో ఎన్ని సినిమా అవకాశాలు వస్తాయో చూడాలి.

ఇప్పటికే ఆమె హీరో రామ్ చరణ్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు మరో ఇద్దరు ముగ్గురు హీరోలు కూడా ఈమెను తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఆ విధంగా జాన్వీ కపూర్ తొందరలోనే ఇక్కడ జెండా పాతేసి అందరినీ మైమరిపించడం ఖాయం అని చెప్పాలి.