Tollywood: Harish shankar next movie which hero

Tollywood: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాస్ చిత్రాల దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు హరీష్ శంకర్. ఆయన మొదటి సినిమా ‘షాక్’ దగ్గర నుంచి మొన్నటి వరకు మంచి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ఆయన సినిమాలలో ప్రధానంగా కామెడీ చాలా బాగుంటుంది. యాక్షన్ సీన్లు అలాగే రొమాన్స్ సీన్లు కూడా చాలా బాగుంటాయి. రొమాంటిక్ సీన్లను తెరకెక్కించడంలో హరీష్ శంకర్ కు ప్రత్యేక శైలి ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఆయన రవితేజ హీరోగా ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా చేశారు.

Harish shankar next movie which hero

ఆగస్ట్ 15 న విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల ప్రేక్షకులలో మంచి అంచనాలను నింపేశారు. ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకులు మంచి పుష్ ఇచ్చారు. అంతేకాదు ఆ మధ్య విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమాలకు సంబంధించి ఓ అయోమయం ఆయన అభిమానులలో నెలకొంది.

Also Read: Raviteja: పూరీ, రవితేజ ల మధ్య చెడిందా? అసలేమైంది!!

గత కొన్ని రోజులుగా ఆయన చేయబోయే తదుపరి సినిమా ఫలానా హీరోలతో ఉండబోతుంది అని వార్తలు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఆయన తన తదుపరి సినిమాను తో చేయబోతున్నట్లుగా ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. అంతేకాదు ఆ తరువాత మరొక చోట మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పానని తొందరలోనే ఆ సినిమా పనులు మొదలుపెడతానని కూడా చెప్పారు. అంతకుముందు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అయ్యాయి

ఆ విధంగా ఈ దర్శకుడు ఎవరితో సినిమా చేస్తున్నాడో అన్న విషయం తెలియక అభిమానులు తెగ అయోమయానికి గురవుతున్నారు. రీమేక్ సినిమాలను తనదైన స్టైల్ లో తయారుచేసి ప్రేక్షకులను అలరించడంలో దిట్ట హరీష్ శంకర్. ఈ సినిమాతో పాటే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా మొదలుపెట్టగా అది మధ్యలోనే అయిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా ఎప్పుడు చేస్తారో ఇంకా క్లారిటీ రాలేదు.