Mamitha Baiju grabs Hero Vijay movie Offer

Mamitha Baiju: సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ అవకాశం వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకొని ప్రేక్షకులను అలరించడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని.. ఇంకా హీరోయిన్లకు అయితే ఇది మరింత కష్టంతో కూడుకున్న పని అనే చెప్పాలి. హీరోయిన్లు సినిమా అవకాశం అందుకోవడం చాలా తేలికే అయినప్పటికీ వారు ప్రేక్షకులను మెప్పించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.

Mamitha Baiju grabs Hero Vijay movie Offer

ముఖ్యంగా టాలీవుడ్ లాంటి కమర్షియల్ సినిమా పరిశ్రమలో ఓ హీరోయిన్ అవకాశం అందుకోవడం, స్టార్ హీరోయిన్ గా ఎదగడం అనేది ఎంతో కష్టం. అలాంటి సమయంలో ఓ యువ హీరోయిన్ ఇప్పుడు ఇక్కడ వరుస చిత్రాల అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఆమె ఎవరో కాదు మమత బైజు. మలయాళం లో తెరకెక్కిన ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయగా ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మమతకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.

Also Read: Tollywood: రామ్, చిరు,విజయ్ దేవరకొండ.. ఆ డైరెక్టర్ లిస్ట్ లో ఇంతమందా!!

క్యూట్ ఎక్స్ప్రెషన్స్, మంచి అభినయం, అమాయకత్వం అన్ని కలిసి ఉండడమే.. ఆమెకి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా రావడానికి కారణం అవుతున్నాయి. ఫైనల్ గా ఆమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వస్తున్న సమయంలోనే తమిళ చిత్ర పరిశ్రమలోని వారు కూడా ఈమెను తమ సినిమాలలో నటింప చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా దళపతి విజయ్ నటిస్తున్న తాజా సినిమాలో ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని వార్త కోలీవుడ్ లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

దళపతి విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ది గోట్ లైఫ్ అనే సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తున్నగా త్వరలోనే ఆయన నటించబోయే తదుపరి సినిమా యొక్క అనౌన్స్మెంట్ రాబోతుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా ఉండబోతుంది అని చెబుతున్నారు. ఇక విజయ్ తన తదుపరి సినిమాను హెచ్ వినోద్ దర్శకత్వంలో చేయబోతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా మమితను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది.