Kavya Thapar and Bhagyashree Borse Glamour Showdown on Aug 15

Kavya Thapar and Bhagyashree Borse: ఒకవైపు బొద్దు అందాలు.. ఇంకొక వైపు సన్నని అందాలు.. ఈ ఆగస్టు 15వ తేదీన రెండు సినిమాలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కాబోతూ ఉండగా ఈ చిత్రానికి పోటీగా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇది మాత్రమే కాకుండా మరొక చిన్న చిత్రం కూడా తేదీన విడుదల కాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలు వివాదాలు నడుమ విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రాలలో నటించే హీరోయిన్లను చూడడానికి తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

Kavya Thapar and Bhagyashree Borse Glamour Showdown on Aug 15

‘డబల్ ఇస్మార్ట్’ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తూ ఉండగా ఆమెను తెరపై చూసి తరించాలన్న కొంతమంది అభిమానుల కోరిక ఇప్పుడు తీరుతుంది. ఇప్పటికే పలు సినిమాలతో ప్రేక్షకులను తన అందాలతో తనివి తీర ఎంజాయ్ చేసేలా చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో ఆమె గ్లామర్ డోస్ బాగా చూపించింది అని చెబుతున్న నేపథ్యంలో ఆమెను తెరపై చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే.

Also Read: Mamitha Baiju: కుర్ర అందాలకు భలే ఛాన్స్.. సెటిల్ అయ్యేనా!!

ఏ హీరోయిన్ కు కూడా దక్కనటువంటి గ్రాండ్ ఎంట్రీని ఈ సినిమా ద్వారా ఆమె ఇవ్వబోతుంది. ఇప్పటికే పలు పోస్టర్లు ఆమె క్రేజ్ ను పెంచగా ఈ సినిమా ఆమెకు ఏ విధమైన అవకాశాలను తెచ్చిపడుతుందో చూడాలి. నిర్మాతలకే కాదు హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా ఈ సినిమాల విజయాలు తప్పనిసరి అయింది అని చెప్పాలి. భాగ్యశ్రీ మొదటి లుక్ నుంచి కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన పోస్టర్లు ఆమెకు విపరీతమైన క్రేజ్ను తీసుకోవచ్చాయి. సినిమా విడుదలకు ముందే మరిన్ని సినిమా అవకాశాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ చిత్రంలో మంచి నటన కనబరిస్తే భవిష్యత్తు టాలీవుడ్ నెంబర్వన్ హీరోయిన్ గా మారే అవకాశం లేకపోలేదు. అటు కావ్య కూడా పలు సినిమాలతో అలరించి ఇప్పుడు ఈ సినిమాతో ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది.