Vijay Deverakonda Road to Redemption

Vijay Deverakonda: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హిట్ ఒకటే అందరికీ సమాధానం చెబుతూ ఉంటుంది. విజయం ఉన్నవారిని ఒకరకంగా, అపజయాలు ఉన్న వారిని ఒకరకంగా చూస్తూ ఉంటారు. ఆ విధంగా సినిమా పరిశ్రమలో హిట్టున్న హీరోలకు చుట్టూ నిర్మాతలు, దర్శకులు పెరుగుతూ ఉంటారు. అలా మంచి మార్కెట్ తో పాటు ప్రేక్షకులలో మంచి ఆదరణ దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ. గత కొన్ని సినిమాలుగా వరుస ప్లాపులతో ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నారు రౌడీ.

Vijay Deverakonda Road to Redemption

గీత గోవిందం తర్వాత ఎన్నో సినిమాలతో అలరించాడు విజయ్.. వాటిలో డియర్ కామ్రేడ్, టాక్సీవాలా చిత్రాలు తప్ప మిగతావన్నీ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. మధ్య లో వచ్చిన ఖుషి పర్వాలేదనిపించింది. అయినా ఈ హీరోకి పెద్ద చిత్రాల అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గౌతమ్ తిన్నూనూరి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తరువాత మరో ఇద్దరు యువ దర్శకులతో సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇలా ఈ మూడు సినిమాలు కనుక ఆయనకు విజయాలు తెచ్చిపెడితే తప్పకుండా టైర్ వన్ హీరోల సరసన నిలబడడం ఖాయం అనే చెప్పాలి.

Also Read: Raviteja: పూరీ, రవితేజ ల మధ్య చెడిందా? అసలేమైంది!!

సోషల్ మీడియాలో ఈ హీరో గురించిన నెగెటివిటీ ఏ విధంగా స్ప్రెడ్ చేస్తారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కొందరు కావాలనే ఈ హీరో క్రేజ్ తగ్గించాలన్న ప్రయత్నంతో మార్కెట్ కింద పడాలన్న ప్రయత్నంతో లేని నెగెటివిటీని వ్యాప్తి చేయిస్తూ ఉంటారు. అలా ఆయన గత సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ భారీ స్థాయిలో నెగిటివిటీకి గురవగా ఆ చిత్రం అనుకున్న దానికంటే ఎక్కువ వసూళ్లను సాధించింది అందరి నోళ్ళు మూయించింది.

దాంతో ఈసారి 100కు 100% ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేయాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఇటీవల ఆయన తాజా సినిమాకు సంబంధించిన లుక్ బయటకు వచ్చింది. సినిమా ఏ విధంగా ఉండబోతుందో అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగించేలా ఈ పోస్టర్ ఉంది. మార్చి 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో వారిని ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా అనిరుద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు