Mashrafe Mortaza: మన పక్క దేశమైన బంగ్లాదేశ్ లో అత్యంత దారుణమైన పరిస్థితులను నెలకొన్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేయడంపై అక్కడ నిరుద్యోగులు అలాగే విద్యార్థులు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అక్కడి ప్రధాని షేక్ హసీనా నిర్ణయం తీసుకోవడం జరిగింది. Mashrafe Mortaza
Former Bangladesh Captain Mashrafe Mortaza’s House Set On Fire
అయితే ఆ కుటుంబాలకు రిజర్వేషన్లు ఇస్తే తమకు అన్యాయం జరుగుతోందని… బంగ్లాదేశ్ నిరుద్యోగులు తిరుగుబాటు చేశారు. గడిచిన నెల రోజులుగా ఇదే తంతు జరుగుతోంది. దాదాపు 200 మందికి పైగా జనాలు మరణించారు. ఇక సోమవారం రోజున ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకు చెక్కెశారు.Mashrafe Mortaza
Also Read: Jagan: బెంగళూరులోనే జగన్ ఉండడానికి ఇంత పెద్ద కారణం ఉందా?
దీంతో ప్రధాని షేక్ హసీనా ఇంటిని ముట్టడించి… నాన హంగామా చేశారు ఆందోళన కారులు. ప్రధాని షేక్ హసీనా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న సమాను కూడా దొంగిలించారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్.. స్థానిక ఎంపీ మోర్తాజా ఇంటిని కూడా ముట్టడించారు ఆందోళనకారులు. Mashrafe Mortaza
అంతేకాకుండా మోర్తాజా ఇంటికి నిప్పు కూడా పెట్టారు ఆందోళనకారులు. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు షకీబుల్ హసన్ ఇంటికి వెళ్లి ఆందోళనకారులు నిరసన తెలిపారు. Mashrafe Mortaza