Abhishek Bachchan: బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. ఆ హీరోయిన్ వల్లే నా జీవితం నాశనం అంటూ ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఐశ్వర్యతో విడాకుల వార్తలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో ఆమె వల్ల నా జీవితం నాశనం అయ్యింది అని ఐశ్వర్యను ఉద్దేశించి అన్నారా.. లేక వేరే ఎవరైనా మహిళను ఉద్దేశించి అన్నారా అనేది ఇప్పుడు చూద్దాం. అభిషేక్ బచ్చన్ ఆమె వల్ల నా జీవితం నాశనం అని ఐశ్వర్యను ఉద్దేశించి అనలేదు.
Abhishek Bachchan: That heroine ruined my life
ఆయన సినిమాలో నటించిన ఓ హీరోయిన్ గురించి అన్నారు. అభిషేక్ బచ్చన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను కరీనాకపూర్ తో నటించే సమయంలో ఆమె నన్ను మీరు నాకు అన్నయ్య లాంటివారు. మీతో లవ్ లో ఉన్నట్టు నేను ఎలా నటించగలను, రొమాన్స్ ఎలా చేయగలను అని నేరుగా అభిషేక్ బచ్చన్ తోనే అన్నదట. అయితే ఇది ఇద్దరికీ మొదటి సినిమానే. (Abhishek Bachchan)
Also Read: Heroine: సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకున్న ప్రభాస్ హీరోయిన్..?
దాంతో అప్పుడే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ ఆ సినిమా షూటింగ్ సమయంలో కరీనా కపూర్ తో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించే సమయంలో ఆమె మాటలు గుర్తుకు వచ్చి సరిగ్గా చేయలేదట. ఆమె అన్న మాటలకు నా నటన నాశనం అయింది. కరీనా నా లైఫ్ లో క్షమించలేని తప్పు చేసింది అంటూ తన మొదటి సినిమా అనుభవాలను అభిషేక్ బచ్చన్ బయటపెట్టారు.
ఇక కరీనాకపూర్ సిస్టర్ కరిష్మా కపూర్ ని అభిషేక్ బచ్చన్ ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది.అయితే దీనికి కారణం ఐశ్వర్యరాయ్ అనే పుకార్లు అప్పట్లో వినిపించాయి. కానీ కరీనాకపూర్ ఫ్యామిలీకి మాత్రం ఐశ్వర్య అంటే కోపం లేదని, కరీనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.మాకు ఐశ్వర్య అంటే అపారమైన గౌరవం ఉంది అని ఆమెపై మాకు ఎలాంటి కోపం లేదు అని క్లారిటీ ఇచ్చింది.(Abhishek Bachchan)