Bhagyashri Borse: సినిమా పరిశ్రమలో వచ్చిన క్రేజ్ ను, స్టార్డం ను నిలుపుకోవాలి అంటే సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అవి దీర్ఘకాలంగా వారికి మంచి జరిగేలా ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లుగా ఫ్లోలో వెళితే స్టార్స్ అవ్వాల్సిన వారు మధ్యలోనే అన్ని సర్దుకుని ఇంటికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తక్కువ కెరియర్ స్పాన్ ఉండే హీరోయిన్లు తమ కెరియర్ను ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి అంటే ఎంతో జాగ్రత్తగా తమ కెరియర్ ను ప్లాన్ చేసుకోవాలి.
The Importance of Smart Movie Selection for Bhagyashri Borse
ఆ విధంగా ఇప్పటిదాకా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని చాలామంది హీరోయిన్లు దశాబ్ద కాలంగా ప్రేక్షకులను అలరించి ఆకట్టుకున్నారు. కానీ మధ్యలో కొంతమంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం పట్ల మధ్యలోనే వారి సినీ జర్నీని ఆపేసుకోవాల్సి వచ్చింది. ఇటీవల కాలంలోని హీరోయిన్ లు నాలుగైదు సినిమాలకే లాంగ్ కెరియర్ అనుకున్న వాళ్లు తక్కువ సమయంలోనే తమ కెరియర్ను ముగించుకొని వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిలో కృతి శెట్టి మరియు శ్రీ లీల ఇద్దరు కూడా ముందున్నారని చెప్పాలి.
Also Read: Heroine: సీక్రెట్ గా నిశ్చితార్ధం చేసుకున్న ప్రభాస్ హీరోయిన్..?
కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో పరిచయమయ్యి భారీ బ్లాక్ బస్టర్ అందుకొని టాప్ హీరోయిన్ అయ్యే విధంగా కనిపించింది. కానీ ఆ తరువాత ఆమె చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో మెల్లమెల్లగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేవని చెప్పాలి. ఇక మరొక హీరోయిన్ శ్రీ లీల కూడా ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఒకేసారి అరడజన్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న శ్రీ లీల ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా లేదనే చెప్పాలి. దానికి కారణం తన పాత్రకు న్యాయం చేయలేకపోవడమే.
మంచి పాత్రలను ఎంచుకోకుండా ఇష్టమున్నట్లుగా సినిమాలు చేయడం వలనే ఆమెకు ఈ స్థితి వచ్చిందని చెప్పాలి. ఇక ఇప్పుడు అందరి చూపు మిస్టర్ బచ్చన్ సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ పైనే ఉంది. ఈ చిత్రం విడుదల కాకముందే ఆమెకు భారీ స్థాయిలో క్రేజ్ రావడంతో పాటు సినిమా ఆఫర్లు కూడా విరివిగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమె కెరియర్ శ్రీ లీల, కృతి శెట్టి లాగా కాకుండా ఉండాలి అంటే ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఆమె అభిమానులు కూడా అదే చెబుతున్నారు. అందాల పరంగా అభినయం పరంగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించే విధంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమాల ఎంపిక ఏ విధంగా చేసుకుంటుందో చూడాలి.