Tollywood: High Hopes for Mr. Bachchan Amid August Releases

Tollywood: ఈ ఆగస్టు నెల టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి మరిన్ని సినిమాలను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీన 3 సినిమాలను తీసుకువస్తుండగా అందులో రవితేజ నటించిన సినిమాకే ఎక్కువ క్రేజ్ నెలకొని ఉందని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన విడుదల కావడానికి రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలయి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది.

Tollywood: High Hopes for Mr. Bachchan Amid August Releases

వాస్తవానికి ఆగుస్ట్ 15 డేట్ ను చాలా రోజుల క్రితమే నిర్మాతలు బ్లాక్ చేసుకున్నారు. కానీ సడన్ గా రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ఈ డేట్ రావడానికి సిద్ధమవుతూ ఉండడం వారిని కొంత హార్ట్ చేసిందని చెప్పాలి. పలు ఫైనాన్షియల్ కారణాల మేరకు ఈ చిత్రాన్ని ఆగస్టు 15వ తేదీన విడుదల చేయడానికి ఒప్పుకున్నానని దర్శకుడు ఇప్పటికే స్పష్టం చేయగా మొదటి నుంచి కూడా ఈ సినిమాకు మంచి బజ్ ఏర్పడడం ప్రేక్షకులలో అంచనాలు పెరగడానికి కారణం అయ్యిందని చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల అయ్యాయి.

Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ తర్వాతే చరణ్,సుకుమార్ సినిమా!!

ఇవి సినిమా పట్ల అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ గురించి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకోవడం సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ రెండు భారీ యాక్షన్ సినిమాలలో రవితేజ సినిమాకి ఎక్కువ క్రేజ్ నెలకొని ఉండడం సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఇక ఈ రెండు సినిమాలతో పాటు మరొక సినిమా కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది. గీత ఆర్ట్స్ సంస్థలో బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘ఆయ్’ చిత్రం ఆగస్టు 15వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతుంది

వాస్తవానికి ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడం కరెక్టా కాదా అని వారు చాలా రోజులుగా భావిస్తూ వచ్చారు కానీ తప్పని పరిస్థితుల్లోనే ఈ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేయబోతున్నామని వారు వెల్లడించారు. మరి ఈ మూడు చిత్రాలలో ఏ సినిమా ప్రేక్షకులను అలరించి మంచి కలెక్షలను సాధిస్తుందో చూడాలి మరి. ఇది మాత్రమే కాకుండా తమిళ చిత్రం ‘తంగలాన్’ కూడా ఈరోజునే విడుదల కాబోతుంది.హీరో విక్రమ్ కు తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.