Siddhu Jonnalagadda: డీజే టిల్లు తెలుగు సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆ తర్వాత కూడా ఆయన ఈ సినిమా యొక్క సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ చేసి మరొకసారి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన కెరియర్ లోనే ఏ సినిమాకు రానున్నటువంటి కలెక్షన్లను ఈ సినిమాతో అందుకుని క్రేజీ హీరోగా మారిపోయాడు. ఏదేమైనా ఎన్నో సంవత్సరాల తర్వాత సిద్దు జొన్నలగడ్డకు ఇప్పుడు ఒక మంచి సక్సెస్ వచ్చిందని చెప్పాలి.

Siddhu Jonnalagadda: Is He Losing His Momentum?

దాదాపు పది సంవత్సరాలకు పైగా సినిమా పరిశ్రమలో చిన్న చిన్న సినిమాలు చేస్తూ వచ్చిన సిద్దు కు ఇప్పుడు ఒక మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ హీరోతో సినిమా చేయడానికి ప్రతి ఒక్క దర్శకుడు, నిర్మాత కూడా భావిస్తున్నారు. ఇక యూత్ లో కూడా మంచి క్రేజ్ పెరిగిపోవడంతో ఈ హీరోకు పెద్దపెద్ద సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ హీరో చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పాలి. ఏదేమైనా ఈ హీరోకి మంచి మంచి సినిమా అవకాశాలు రావడం ఆయన అభిమానులను ఎంతగానో సంతోష పెడుతుంది.

Also Read: Samantha: ఫేడ్అవుట్ దశలోనూ సమంత రేంజ్ మాములుగా లేదు!!

అయితే చేతిలో మంచి సినిమాలో ఉన్న నేపథ్యంలో ఓ పెద్ద చిత్రంలో గెస్ట్ రోల్ చేయడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో ఆయన ఓ కీలకపాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. సినిమాలో ఆయన పాత్ర మూడు నిముషాలు ఉండబోతుంది అని అంటున్నారు. ఓ ఫైట్ సీక్వెన్స్ లో వచ్చే చిన్న పాత్రలో ఆయన కనిపించబోతున్నారట. దీన్నిబట్టి ఇది ఎంత కీలకమైన పాత్ర అర్థమవుతుంది. అయితే తనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ విధంగా గెస్ట్ రోల్ చేయడం ఆయన కెరియర్ కు అంత మంచిది కాదని కొంతమంది సలహా ఇస్తున్నారు.

ఏదేమైనా సిద్ధూ ఆచితూచి సినిమాలను చేయాలని, ఎలా పడితే అలా సినిమాల్లో చేసి వచ్చిన క్రేజ్ను పోగొట్టుకుంటే మాత్రం మళ్ళీ పుంజుకోవడం దాదాపుగా కష్టమని చెబుతున్నారు. మరి ఈ సలహాను సిద్ధూ ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం అయన ‘తెలుసు కదా’ అనే సినిమాలో నటిస్తున్నాడు.