Mrunal Thakur: టాలీవుడ్ లో సక్సెస్ అయిన చాలామంది హీరోయిన్లు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి వెళ్లి అక్కడ సినిమాలను చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ విధంగా ఇప్పటిదాకా తెలుగులో చేసిన చాలా మంది హీరోయిన్లు హిందీలోకి వెళ్లి అక్కడ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఇప్పుడు అలాంటి వారి హీరోయిన్ల జాబితాలో మరొక హీరోయిన్ కూడా జాయిన్ కాబోతూ ఉండడం అందరిని విశేషంగా ఆకట్టుకుంటుంది.
Mrunal Thakur: A Tollywood Star Heading to Bollywood
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘సీతారామం’ సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆమె నటించిన పలు తెలుగు సినిమాలో హిందీలో విడుదల కాగా ఆ సినిమాల ద్వారా ఆమెకు అక్కడ కూడా మంచి నేమ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె అక్కడ వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఇటీవలే ఆమె ‘పూజ మేరీ జాన్’ షూటింగ్ను పూర్తి చేసుకుంది. అలాగే హై జవానీ హైజవానీ హై తో ఇష్క్ హోనా హై అనే సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది.
Also Read: Bangladesh: బంగ్లా అల్లర్ల వెనుక పాకిస్తాన్ కుట్రలు….? మోడీ బిగ్ స్కెచ్..!
అక్కడ మంచి పారితోషకం అందుకోవడంతోపాటు రెట్టించిన అవకాశాలు కూడా రావడంతో ఈమె అక్కడే సినిమాలు చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుందని తెలుస్తుంది. అయితే ఈ రెండు సినిమాలు సెట్ల మీద ఉండగానే ఈమె ఇప్పుడు మరొక సినిమాలో కూడా నటించేందుకు సిద్ధమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘సన్నాఫ్ అఫ్ సర్దార్ 2’ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపిక కాబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 170 కోట్లకు పైగా వసూల్లని సాధించిన ఈ సినిమా యొక్క సీక్వెల్లో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు.
అజయ్ దేవగన్ ఈ చిత్రంలో హీరో గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నటించిన సోనాక్షి ని కాదని మృణాల్ ను పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు అంటే ఆమెకు ఎంతటి క్రేజ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో తెలుగులో ఆమె సినిమాలను చేస్తుందా అనేది అనుమానంగానే ఉంది. తెలుగులో అయితే ఆమె హను రాఘవాపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఆమె దాదాపుగా ఖాయం అనే చెప్పాలి.