Vinesh Phogat: ఒక 100 గ్రాములు యావత్ దేశాన్ని కదిలిస్తుందని ఎప్పుడైనా ఊహించారా…. బుధవారం ఆ 100 గ్రాముల యావత్ దేశాన్ని షాక్ కి గురిచేస్తోంది. అసలు ఏం జరిగిందంటే… పారిస్ ఒలంపిక్స్ లో ఫైనల్స్ కు చేరి పథకం కాయం అనుకున్న వినేష్ ఫోగట్ ను డిస్మిస్ చేశారు. దీనికి గల కారణం 50 కేజీల కేటగిరీలో ఆమె అంతకన్నా ఎక్కువ బరువు ఉందట. ఆమె ఎంత ఎక్కువ బరువు ఉంది అని చూస్తే….ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆమె 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందట. Vinesh Phogat

What about Vinesh Phogat Is this a BJP conspiracy

దీంతో ఫైనల్ లో ఎలాంటి పోటీ లేకుండానే ఆపోజిట్ ప్లేయర్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఇక ఈ పోటీలో ఎవ్వరు కూడా సిల్వర్ మెడల్ గెలుచుకోలేదు. అంతర్జాతీయ మీడియాల కథనాల ప్రకారం…. దినేష్ పొగట్ మంగళవారం మ్యాచ్ ముందు కూడా 50 కేజీల కన్నా ఎక్కువ బరువు ఉందట. రన్నింగ్, స్కిప్పింగ్ వంటి సాహసాలు చేస్తూ కేలరీలను కరిగించిందట. Vinesh Phogat

Also Read: Gautam Gambhir: డేంజర్ జోన్ లో గంభీర్? వైరల్ అవుతున్న శర్మ కామెంట్స్

అప్పుడు బరువు కాస్త తగ్గిందట. దీంతో క్వాలిఫయర్స్, సెమీ ఫైనల్స్ లో ఆడి విజయం సాధించింది. అయితే ఫైనల్ కు వెళ్లే ముందు బరువు చూడగా 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో ఆమెను డిస్ క్వాలిఫైయర్ చేశారు. ఫైనల్ మ్యాచ్ మొదలయ్యే సమయానికి బరువు తగ్గుతుంది. కాస్త సమయం ఇవ్వండి అని ఇండియన్ ప్రతినిధులు కోరినప్పటికీ ఒలంపిక్స్ రూల్స్ ప్రకారం అనర్హత వేటు వేశారు. Vinesh Phogat

దీంతో కచ్చితంగా పథకం వస్తుందన్న వారి ఆశలు ఇప్పుడు ఆవిరయ్యాయి. అయితే, వినేష్ ఫోగట్ పై వేటు పడటానికి కారణం బీజేపీ అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ బ్రీజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా వినేష్ ఫోగట్ పోరాటం చేశారు. అయితే అది మనసులో పెట్టుకొని వినేష్ ఫోగట్ పై కుట్రలు చేసారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. Vinesh Phogat