Vijay deverakonda: హీరో విజయ్ దేవరకొండ కథల ఎంపికలో కొన్ని పొరపాట్లు చేశారన్న వార్తలు సినిమా ఇండస్ట్రీలో మొన్నటిదాకా బాగా వినిపించాయి. గీతగోవిందం, టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ చిత్రాలు చేసిన తర్వాత ఇప్పటిదాకా విజయ్ దేవరకొండకు సరైన విజయం దక్కలేదని చెప్పాలి. మధ్యలో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం పర్వాలేదనిపించగా ఆ తర్వాత ఆయనకు డీసెట్ హిట్ అంటే ఖుషి సినిమా అనే చెప్పాలి. అలా తన రేంజ్ కు తగ్గ సినిమాలు చేయకుండా అభిమానులను మెప్పించలేకపోయాడు విజయ్ దేవరకొండ.
The Transformation of Vijay Deverakonda
ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలను బట్టి కథల ఎంపికలో ఆయన చాలా మారిపోయాడని అంటున్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సినిమా యొక్క లుక్ ఇటీవల విడుదల కాగా ఇది ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన అందుకుంది. దీన్నిబట్టి ఈ చిత్రం తప్పకుండా విజయ్ కెరియర్లో మంచి సినిమాగా మిగులుతుంది అని చెప్పవచ్చు. అంతేకాదు అనిరుద్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చడం అదనపు బలం అవుతుందని చెప్పాలి.
Also Read: Prabhas: ప్రభాస్ దానిమీద ఇంత ఇంటరెస్ట్ ఎందుకు?
ఈ సినిమా తర్వాత విజయ్ చేయబోతున్న మరో రెండు సినిమాలకు సంబంధించిన కథలు కూడా చాలా బాగున్నాయని కొన్ని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తుంది. దర్శకులు మంచి టాలెంటెడ్ అవడంతో వారు తప్పకుండా సూపర్ హిట్ విజయ్ కు అందిస్తారని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న రవి కిరణ్ సినిమాపై అందరికీ మంచి అంచనాలే ఉన్నాయి. ఇక టాక్సీవాలా లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని చేసిన రాహుల్ సంకృత్యాన్ సినిమా పైన కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
నటుడిగా ఏ స్థాయిలో విజయ్ దేవరకొండ నటించి ప్రేక్షకులను అలరిస్తాడో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచి కథ సరైన దర్శకుడు తగిలితే మాత్రం తప్పకుండా టైర్ వన్ హీరోలకు మించిన స్థాయిలో ఆయనకు కలెక్షన్లు వస్తాయని చెప్పాలి. దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొన్నప్పటికీ విజయ్ దేవరకొండ ఎంపిక చేస్తున్న సినిమాలు ఎవరికి నచ్చడం లేదు. మరి ఈ మూడు సినిమాల ద్వారా ఈ సెన్సేషనల్ హీరో కం బ్యాక్ ఇస్తాడా అనేది చూడాలి.