Sujith: కొంతమంది దర్శకుల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే హిట్ సినిమా చేసిన కూడా వారికి తదుపరి సినిమా అవకాశం రావడానికి చాలా సమయం పడుతుంది. ఆ విషయంలో వారు ఫెయిల్ అయినట్లే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా హరీష్ శంకర్ లాంటి దర్శకులకు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ వారు తమ తదుపరి సినిమాను వెంటనే సెట్ చేసుకొని సినిమాలు చేయడంలో విఫలం అవుతూ ఉంటారు. ఆయన దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఇప్పుడు విడుదల కాబోతుంది.

Sujith: Facing the Harsh Realities of Post-Hit Struggles

అంతకు ముందు ఆయన చేసిన గద్దల కొండ గణేష్ చిత్రం విడుదల అయ్యాక మరో సినిమా చేయడానికి కొన్ని సంవత్సరాలు అయింది. మధ్యలో ఓ సినిమా మొదలు పెట్టినప్పటికీ అది మధ్యలోనే ఆగిపోయింది. ఆ విధంగా హరీష్ శంకర్ కు బ్యాడ్ లక్ చాలా ఎదురైందని చెప్పాలి. అంతకుముందు కూడా ఆయన సినిమాలు చేసే విషయంలో చాలా ఆలస్యం చేస్తూ వచ్చారు. గబ్బర్ సింగ్ తరువాత చాలా గ్యాప్ తీసుకొని మరి ఆయన తన తదుపరి సినిమాను మొదలుపెట్టారు.

Also Read: Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ వరకు టెన్షనే!!

ఇప్పుడు ఆ విధంగానే సుజిత్ కెరియర్ కూడా ఉండబోతుందా అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడుగా పరిచయమయి సూపర్ హిట్ అందుకున్న సుజిత్ ఆ తర్వాత వెంటనే ప్రభాస్ తో కలిసి సినిమా చేశాడు. అలా సాహో సినిమా చేసి రెండవ సినిమాకే భారీ బడ్జెట్ సినిమా చేసిన సుజిత్ ఆ తరువాత సినిమాను ఓకే చేయడంలో చాలా జాప్యం చేస్తున్నాడని చెప్పాలి. మధ్యలో చిరంజీవితో సినిమా చేయాలని భావించిన అది ఎందుకో వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమాను మొదలుపెట్టి దాన్ని ఇంకా విడుదల చేయలేదని చెప్పాలి.

రాజకీయ కారణాలవల్ల ఆ సినిమా యొక్క ఆఖరి షెడ్యూల్ వాయిదా పడింది. తొందరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని భావిస్తుందట యూనిట్. మరి ఈ సినిమా తర్వాత నైనా వరుస సినిమాలను చేసి తన అభిమానులను అలరిస్తాడా అనేది చూడాలి. మొదటినుంచి ఆయన చిత్రాలలో ఓ ప్రత్యేక శైలి ఉంది. చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ ఆయన టేకింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. మరి పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా ఆయనకు ఎలాంటి పేరుని తీసుకువస్తుందో చూడాలి.