Akhil Akkineni: అక్కినేని అఖిల్ వరుస సినిమాల పరాజయాలతో ఓ మంచి సినిమా చేయాలని చెప్పి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఆయన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు పెద్దగా ప్రేక్షకులను అలరించిన సినిమాలేవీ లేవు. ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మిగతా దేవి కూడా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇటీవల కాలంలో వచ్చిన ఏజెంట్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మారింది.

Akhil Akkineni: Struggling for a Comeback

ఆ విధంగా ఇప్పుడు చేసే సినిమా తప్పకుండా మంచి సినిమా చేయాలని ప్రేక్షకులను ముఖ్యంగా అక్కినేని అభిమానులను మెప్పించే విధంగా సినిమా ఉండాలని భావించి చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు అక్కినేని అఖిల్. ఇంకోవైపు అక్కినేని అఖిలతో సినిమా చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రావట్లేదు అన్న వాదన ఉంది. వరుసగా ఇన్ని ప్లాపులు ఇవ్వడం వల్ల ఆయనతో సినిమా చేయాలి అంటే నిర్మాత భయపడిపోతున్నాడట.

Also Read: Raviteja: ఈ వయసులో ఆ రొమాన్స్ ఏంటి రాజా.. హరీష్ ధీటైన జవాబు!!

ఏదేమైనా అక్కినేని లాంటి పెద్ద ఫ్యామిలీలో పుట్టిన అఖిల్ కు ఇప్పటిదాకా ఒక భారీ విజయం రాకపోవడం నిజంగా నిరాశపరిచే విషయమై చెప్పాలి. యూవీ క్రియేషన్స్ వారు ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాలనుకున్నారు. అయితే అది ఉంటుందో లేదో అన్న విషయంపై వారు ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీనికి తోడు చిరంజీవి సినిమా కోసం వారు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనే విషయం ఈ సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలను మరింత పెంచుతుంది.

తాజాగా రవితేజ హీరోగా నటించబోయే సినిమాను ఈ అక్కినేని హీరో చేయబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దర్శకుడు కిషోర్ తిరుమల ఓ కథను రవితేజ కోసం రాసుకోగా ఆ సినిమా చేయడానికి రవితేజ సిద్ధంగా లేకపోవడంతో దానిని అక్కినేని అఖిల్ తో చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.