Nithya Menon: తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన కథానాయికలలో ఒకరు నిత్యా మీనన్. తెలుగు సినిమాల్లోనే కాకుండా తమిళం, మలయాళం సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున అలరించింది కేరళ కుట్టి. వరుస సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరీర్‌లో బిజీగా ఉంటూ వచ్చింది. అయితే నిత్యా తో ప్రేమలో పడిన ఓ స్టార్ హీరో ఆమెకోసం సొంత భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. అయితే సదరు హీరో తండ్రి పెళ్లి చేసుకోవడంతో వీరి రొమాన్స్ ఆగిపోయిందని తెలుస్తుంది.
Nithya Menon Alleged Romance with Dulquer Salmaan
వాస్తవానికి నిత్యా తో చాలామంది హీరో లు ప్రేమాయణం నడిపించారు. అయితే ఎందుకో అవి పెళ్లి దాకా వెళ్ళలేదు. అయితే నిత్యా మీనన్ ఎవరితో ప్రేమలో పడింది.. అతను మరెవరో కాదు.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ నిత్యా మీనన్‌తో కలిసి “బెంగళూరు డేస్”, “ఓకే కన్మణి”, “100 డేస్ ఆఫ్ లవ్”, “ఉస్తాద్ హోటల్” మరియు ఇతర చిత్రాలలో పనిచేశారు. ఈ సినిమాలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
Also Read: Raviteja: ఈ వయసులో ఆ రొమాన్స్ ఏంటి రాజా.. హరీష్ ధీటైన జవాబు!!
అయితే దుల్కర్ సల్మాన్ ఇప్పటికే చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సుఫియాను వివాహం చేసుకున్నాడు. వీరి సంసారం హాయిగా సాగుతునప్పటికి నిత్యా అతనిని లవ్ చేసిందట. అయితే దుల్కర్ తండ్రి, ప్రముఖ నటుడు మమ్ముట్టి నిత్యా మీనన్ కు వార్నింగ్ ఇవ్వడంతో ఆమె వెనక్కి తగ్గిందట. ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు సినిమా పరిశ్రమలో చాలా కామన్ అయిపోయాయి.