Gautam Gambhir: గంభీర్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో చాలా రకాల మీమ్స్ వేస్తున్నారు. గడచిన 27 ఏళ్లలో తొలిసారిగా శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయింది భారత్. అది కూడా గంభీర్ హయాంలో కావడం విశేషం. మూడవ వన్డేలో శ్రీలంక 248 పరుగులు చేస్తే…. టీమిండియా 138 పరుగులకే ఆల్ అవుట్ అయింది. దీంతో 110 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. Gautam Gambhir

Gautam Gambhir experiments the reason for Team India defeat

ఈ మూడు మ్యాచుల సిరీస్ లో స్పిన్ ను ఎదుర్కోలేక భారత్ ఓడిపోయింది. ఈ మూడు మ్యాచుల భారత్ మూడు వికెట్లు మాత్రమే పెసర్ కు ఇచ్చింది. మిగతా 27 వికెట్లు స్పిన్నర్లకు పడ్డాయి. దీనిని బట్టి మన భారత ఆటగాళ్ల ఆట తీరు ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఇక్కడ మనవారు ఓడిపోవడం కంటే ఓడిపోయిన తీరే చాలా బాధాకరం. ఎందుకంటే మార్చి నుంచి మొన్న జింబాబ్వే సిరీస్ వరకు మొత్తం టి20 మ్యాచ్లే ఆడారు. Gautam Gambhir

Also Read: Vinesh Phogat: వినేష్ ఫోగట్ పై వేటు.. ఇది బీజేపీ కుట్రనేనా ?

వీరి బ్యాటింగ్ ను చూస్తే టీ20 మత్తు నుంచి భారత్ దిగలేదేమో అనిపిస్తోంది. టీ20 లాగా ఒక 15 బాల్స్ ఆడి టపాటప్ 30, 40 పరుగులు కొట్టిపోతే నడవదు కదా. మరోవైపు ఈ ఓటమికి కోచ్ గంభీర్ కూడా ఒక కారణంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే గంభీర్ టీమ్ లో మార్పులు చాలానే చేశారు. మ్యాచ్ మాచ్ కే చాలా మార్పులు వచ్చాయి. Gautam Gambhir

ఆటగాళ్లు మ్యాచ్ కి మానసికంగా సిద్ధమయ్యేది ఎలా. మొదటి రెండు మ్యాచ్లకూ రాహుల్ ఉన్నాడు. మూడవ మ్యాచ్ లో టీమ్ లో లేడు. నెంబర్ 4 పొజిషన్ లో ఎన్నో మార్పులు వచ్చాయి. అయినా పంత్, దూబే, అక్షర్ వస్తున్నారు పోతున్నారు. కొత్త ప్రయోగాలకు పోతే చెత్త రికార్డు పడింది. దీంతో గంభీర్ వచ్చిన ఫస్ట్ సిరీస్ లోనే 27 ఏళ్ల చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. Gautam Gambhir.