Shocking secret revealed by Sobhitha

Sobhitha: శోభిత ధూళిపాళ్ల..అక్కినేని వంటి బడా ఇంటికి కోడలు కాబోతున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ మొన్నటి వరకు తమ రిలేషన్ ని ఎక్కడ కూడా బయట పెట్టకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసింది. ఇక ఎప్పుడైతే నాగార్జున ఫోటోలు రివీల్ చేసి వారి ఎంగేజ్మెంట్ అయిందని చెప్పారో అప్పటినుండి శోభిత ధూళిపాళ్ల పై నెగెటివిటీ పెరిగిపోయింది.

Shocking secret revealed by Sobhitha

అంతేకాదు నిన్న మొన్నటి వరకు సమంతను నిందించిన అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆమెకు అండగా నిలుస్తూ నాగచైతన్యను నిందిస్తున్నారు. రెండో పెళ్లి చేసుకోవడం కోసమే సమంతకు విడాకులు ఇచ్చావని నాగ చైతన్యని టార్గెట్ చేస్తున్నారు.అంతేకాదు మధ్యలో శోభిత పై కూడా బాగానే నెగిటివిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత దూళిపాళ్ల పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.(Sobhitha)

Also Read: Sumanth: హీరో సుమంత్-కీర్తి రెడ్డిల విడాకులకు కారణం ఆ హీరోయినేనా.?

అయితే ఇంతకీ శోభిత పెట్టిన పోస్ట్ ఏంటయ్యా అంటే.. శోభిత నాగచైతన్య ఇద్దరు ఒక ఉయ్యాలలో కూర్చొని ఉన్న సమయంలో వెనుక నుండి ఫోటోగ్రాఫర్ కెమెరా లో బంధించిన ఫోటోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి దాని కింద ఈ విధంగా క్యాప్షన్ పెట్టింది. “మన మధ్య పరిచయం ఎలా ఏర్పడినా కానీ మన ఇద్దరి మనసులు కలిసాయి” అంటూ శోభిత పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Shocking secret revealed by Sobhitha

ఇక ఈమె పోస్ట్ చూసిన చాలా మంది జనాలు సమంతని సైడ్ చేసి బాగానే కవర్ చేశారు.. నీ సంతోషం కోసం మరో అమ్మాయికి ద్రోహం చేశావు.. వేణు స్వామి చెప్పిన మాటలు విన్నావు కదా..నీకు కూడా అదే గతి పడుతుంది కావచ్చు అంటూ ఇలా సమంత అభిమానులు శోభిత పెట్టిన పోస్ట్ కి నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.(Sobhitha)

https://www.instagram.com/p/C-dCVytqdba/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==