Aishwarya Rai: ఏంటి ఐశ్వర్యరాయ్ నిజంగానే ఫ్రెండ్ తో రిలేషన్ లో ఉందా..అందుకే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ ని పట్టించుకోవడం లేదా.. కుటుంబంలో గొడవలకు కారణం కూడా ఆ ఫ్రెండేనా..బాలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్న న్యూస్ లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.. ఐశ్వరరాయ్ రీసెంట్ గా తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి జిరాక్ మార్కర్ అనే డాక్టర్ తో కలిసి ఓ ఈవెంట్లో పాల్గొంది.
Aishwarya Rai had an love with a friend
అయితే ఆ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.ఇక ఆ ఫొటోస్ లో ఐశ్వర్యరాయ్ జిరాక్ మార్కర్ ని ముద్దు పెట్టుకున్న ఫోటో మరింత వైరల్ అవుతుంది. అయితే ఒక పెళ్ళైన అమ్మాయి ముద్దు పెట్టుకుంటే అది రచ్చ రచ్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీ కావడంతో ఈ రచ్చ మరింత ఎక్కువైంది.(Aishwarya Rai)
Also Read: Kalyan Ram: బాలయ్య పేరు ఎత్తితేనే మండిపడుతున్న కళ్యాణ్ రామ్.. ఏం జరిగిందంటే..?
అయితే అభిషేక్ బచ్చన్ తో విడాకుల వార్తలు వైరల్ అవుతున్న వేళ ఐశ్వర్యారాయ్ మరో వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ప్రస్తుతం మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. దాంతో వీరి విషయం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఐశ్వర్య అభిషేక్ బచ్చన్ కి మధ్య గొడవలు రావడానికి ఆ డాక్టరే కారణమని, ఐశ్వర్య ఫ్రెండ్ తో సాన్నిహిత్యంగా ఉండడం ఇంట్లో వాళ్లకు నచ్చడం లేదని,అందుకే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని,
ఈ కారణం చేతనే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య ఇద్దరు విడాకులు కూడా తీసుకోవాలనుకుంటున్నట్టు సోషల్ మీడియాలో ఒక రూమర్ అయితే వినిపిస్తోంది.మరి బాలీవుడ్ మీడియా వైరల్ చేస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉంది.. నిజంగానే ఐశ్వర్యారాయ్ ఆ డాక్టర్ తో క్లోజ్ గా ఉండడం వల్లే అభిషేక్ బచ్చన్ ఆమెను దూరం పెట్టాడా అనేది తెలియాల్సి ఉంది.(Aishwarya Rai)