Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు నిజంగానే 12 ఏళ్ల కూతురు ఉందా.. నా కూతురు అంటూ రష్మిక మందన్నా పరిచయం చేసింది ఎవర్ని..అసలు ఆమె ఎవరు.. అనే నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఛలో మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అంతకుముందే కన్నడలో కిరిక్ పార్టీ అనే మూవీతో హిట్టు కొట్టింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఈమె నటించిన వరుస సినిమాలు హిట్ అవ్వడంతో రష్మిక కి టాలీవుడ్ లో అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
Does Rashmika have a 12-year-old daughter
అలా దర్శక నిర్మాతలు కూడా వరుస అవకాశాలు ఇవ్వడంతో రష్మిక అప్పుడున్న స్టార్ హీరోయిన్లందరినీ పడగొట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన అంద చందాలతో మైమరపింపచేసింది. ఇక గత ఏడాది వచ్చిన యానిమల్ మూవీలో రష్మిక బోల్డ్ మాటలు యాక్టింగ్ బాలీవుడ్ జనాలను కూడా ఫిదా చేసేసాయి.ఇక మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో డీ గ్లామరస్ లుక్ లో నటించి నేషనల్ క్రష్ గా మారిపోయింది. (Rashmika)
Also Read: Samantha: నాగచైతన్య కంటే ముందే రెండో పెళ్లి చేసుకోబోతున్న సమంత.. ఎవరినంటే..?
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప-2 సినిమాలో కూడా చేస్తుంది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో చేస్తుంది. ఇవే కాకుండా రష్మిక చేతిలో ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఈ హీరోయిన్ 12 ఏళ్ల అమ్మాయిని పరిచయం చేస్తూ నా కూతురు అంటూ పెట్టిన ఫోటో మీడియాలో సంచలనం సృష్టించింది. ఏంటి రష్మిక మందన్నా కి 12 ఏళ్ల కూతురు ఉందా ఇదెక్కడి విడ్డురం అంటూ ఆ ఫోటో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.అయితే ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు రష్మిక సొంత చెల్లెలు.
రష్మిక వయసు 28 ఏళ్లు అయితే ఆమె చెల్లి వయసు 12సంవత్సరాలు. అలా వయసులో ఆ అమ్మాయి చాలా చిన్నది. రష్మిక ప్రతి ఇంటర్వ్యూలో తన చెల్లి షిమాన్ మందన్నా గురించి మాట్లాడుతుంది. నేను సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండి నా చెల్లెల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెబుతుంది. అలాగే ఆమె నాకు చెల్లెలు మాత్రమే కాదు ఒక కూతురు లాంటిది అంటూ రష్మిక చాలా ఇంటర్వ్యూలో ఎమోషనల్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం రష్మికతో తన చెల్లి ఉన్న ఫొటోస్ వైరల్ గా మారాయి.(Rashmika)