Harikrishna: కళ్యాణ్ రామ్ ని హరికృష్ణ నిజంగానే ఇంటి నుండి బయటికి గెంటేసారా.. ఇంట్లో నుండి బయటకి గెంటేసేంత తప్పు కళ్యాణ్ రామ్ ఏం చేసారు? ఇంతకీ వీరి మధ్య గొడవ ఎక్కడి నుండి వచ్చి పడింది అనేది ఇప్పుడు చూద్దాం.నందమూరి వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు.అయితే కళ్యాణ్ రామ్ సినిమాల్లోకి రాకముందు అమెరికాలో పెద్ద జాబ్ చేసేవారట. కానీ సినిమాల మీద ఉన్న ఇష్టంతో జాబ్ వదిలేసి అమెరికా నుండి తిరిగి ఇండియాకి వచ్చేసారు.
Harikrishna who kicked Kalyan Ram out of the house
అయితే అమెరికా వెళ్ళముందే సినిమాల మీద కళ్యాణ్ రామ్ కి ఇంట్రెస్ట్ ఉండేదట.అలా ఓ సినిమాకి ఆయన నిర్మాతగా చేస్తానని కూడా చెప్పారట. కానీ హరికృష్ణ మాత్రం వద్దని కరాకండిగా చెప్పేసి ఇంట్లో నుండి గెంటేసి విదేశాలకు పంపించారట. ఇక అసలు విషయం ఏమిటంటే..వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో హరికృష్ణ ముఖ్యపాత్రలో చేసిన లాహిరి లాహిరి లాహిరిలో మూవీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమా కోసం ముందుగా హరికృష్ణ ని తీసుకుందామనుకున్న సమయంలో హరికృష్ణ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. (Harikrishna)
Also Read: Samyuktha Menon: తల్లికి విడాకులు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న సంయుక్త మీనన్..?
దానికి కారణం వైవిఎస్ చౌదరి దర్శకత్వం బాగా చేయగలడా లేదా అనే నమ్మకం ఆయనలో లేదట. దాంతో ఆ మూవీలో హరికృష్ణని ఒప్పించే బాధ్యత కల్యాణ్ రామ్ తీసుకున్నాడు. అలా ఓ రోజు కళ్యాణ్ రామ్ హరికృష్ణతో ఈ విషయం చెప్పగా నాకు నమ్మకం లేదు నేను నటించనని అన్నారట. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్గా చేస్తాను కచ్చితంగా మీరు ఇందులో నటించాలి అని హరికృష్ణ కి చెప్పారట.కానీ ఇంత చిన్న వయసులో నువ్వు నిర్మాత ఏంటి అని హరికృష్ణ కోపడ్డారట.
దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందట.ఆరోజు గొడవ ఎక్కువై చాలా రోజులు తండ్రి కొడుకులు మాట్లాడుకోలేదట. ఆ తర్వాత హరికృష్ణ కళ్యాణ్ రామ్ దగ్గరికి వెళ్లి నువ్వు అమెరికా వెళ్లి చదువుకుంటానంటే నేను ఈ సినిమాలో నటిస్తాను. నేను సినిమాలో చేసే సమయంలో నువ్వు ఇక్కడ ఉండకూడదు అని అమెరికా పంపించారట. అలా హరికృష్ణ సినిమాలో చేస్తానని ఒప్పుకోవడంతో కళ్యాణ్ రామ్ కూడా అమెరికా వెళ్లి చదువుకొని జాబ్ చేశారట.(Harikrishna)