Mahesh Babu Shock to sobhitha

Mahesh Babu: అక్కినేని కొత్త కోడలు అంటే ప్రజెంట్ వినిపించే పేరు శోభిత దూళిపాళ్ల మాత్రమే.. మరికొద్ది రోజుల్లో అక్కినేని ఇంటికి పెద్ద కోడలుగా రాబోతున్న ఈ ముద్దుగుమ్మ గురించి ఇప్పటికే ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ మహేష్ బాబు శోభితా దూళిపాళ్లకి సంబంధించి ఒక సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.మరి ఇంతకీ ఒక్క సినిమాలో కూడా కలిసి నటించని వీరిద్దరి మధ్య ఉన్న ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం.

Mahesh Babu Shock to sobhitha

మహేష్ బాబు, శోభితా ధూళిపాళ్ల కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ శోభిత దూళిపాళ్ల అడివి శేష్ హీరో హీరోయిన్లు గా చేసిన మేజర్ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా చేశారు. అలా ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మొత్తాన్ని మహేష్ బాబు ఇంటర్వ్యూ చేశారు.ఇందులో భాగంగా అందరూ తమ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు.(Mahesh Babu)

Also Read: Rashmika: రష్మికకి 12 ఏళ్ల కూతురు ఉందా.. బయటపడ్డ సీక్రెట్.?

అయితే శోభిత ధూళిపాళ్ల మాట్లాడే వంతు రాగా ఆమె తన బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఇంగ్లీషులో చెప్పడానికి ప్రయత్నించింది. అయితే ఆమె ఇంగ్లీష్ విని కాస్త కసురుకున్న మహేష్ బాబు తెలుగులో మాట్లాడరా ప్లీజ్.. అంటూ అడిగారు. అంతేకాదు కుదిరితే మీ యాసలో నైనా మాట్లాడండి అంటూ చెప్పారు.

Mahesh Babu Shock to sobhitha

దాంతో మహేష్ బాబు మాటలకి కాస్త అసౌకర్యంగా ఫీలైన శోభిత వెంటనే తెలుగులో మాట్లాడుతూ తన బ్యాక్ గ్రౌండ్ మొత్తం చెప్పేసింది. అయితే ఓల్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవ్వడంతో తెలుగు అమ్మాయి అయినటువంటి శోభిత ఇంగ్లీష్ లో మాట్లాడడంతో మహేష్ బాబు కౌంటర్ కి దిమ్మ తిరిగింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.(Mahesh Babu)