Nithya Menen fell in love with the married hero

Nithya Menen: పొట్టి పిల్లైనా గట్టి పిల్ల అన్నట్లు నిత్యమీనన్ హైట్ తక్కువే అయినప్పటికీ అందంలో ఈమెకు సాటి ఎవరూ రారు అన్నట్లుగా తన చబ్బీ చీక్స్ తో కర్లీ హెయిర్ తో అందమైన మొహంతో ఎంతో మంది కుర్ర కారు గుండెల్ని కొల్లగొట్టింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ 36 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఇంకా పెళ్లికి రెడీ అవ్వడం లేదు. అయితే ఈమెకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదో లేక ఈమెకి నచ్చిన అబ్బాయి దొరకడం లేదో కానీ పెళ్లిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పడం లేదు.

Nithya Menen fell in love with the married hero

అయితే ఈ విషయం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో రూమర్లకు కొదువే లేదు అన్నట్లు అప్పట్లో నిత్యమీనన్ పర్సనల్ కెరియర్ మీద ఓ వార్త తెగ చక్కర్లు కొట్టింది.అదేంటయ్యా అంటే.. నిత్య మీనన్ ఓ హీరోని ప్రేమిస్తుందని, అందుకే ఆ హీరోతో వరుస సినిమాలు చేస్తోందని, ప్రస్తుతం వాళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ఒక రూమర్ కోలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసింది.ఇక నిత్యమీనన్ డేటింగ్ చేస్తున్నట్టు వార్త వచ్చిన హీరో ఎవరయ్యా అంటే దుల్కర్ సల్మాన్..(Nithya Menen)

Also Read: Samantha: నాగచైతన్య కంటే ముందే రెండో పెళ్లి చేసుకోబోతున్న సమంత.. ఎవరినంటే..?

నిత్యమీనన్ దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో బెంగళూరు డేస్, 100 డేస్ లవ్, ఉస్తాద్ హోటల్,ఓ కాదల్ కన్మణి వంటి సినిమాలు వచ్చాయి.. అయితే సినిమా వరకు మాత్రమే కాకుండా దుల్కర్ కి నిత్యమీనన్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది అనేది నిత్యామీనన్ ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పింది.అలాగే గతంలో నిత్యామీనన్ తనని పెళ్లి చేసుకోమని దుల్కర్ సల్మాన్ ఆటపట్టించేవారు అని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Nithya Menen fell in love with the married hero

అలా వీరి మధ్య మంచి రిలేషన్ ఉంది అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే నిత్యమీనన్ దుల్కర్ పై మనసు పడి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది అనే రూమర్ కూడా మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతేకాదు పెళ్లయి పిల్లలున్న దుల్కర్ ని భార్యకు విడాకులు ఇచ్చి తనని రెండో పెళ్లి చేసుకోమని నిత్యామీనన్ వేధించింది అనే టాక్ కూడా కోలీవుడ్లో వినిపించింది.కానీ ఈ విషయంలో ఎలాంటి నిజం లేదు అని నిత్యామీనన్ ఖండించింది.. మా ఇద్దరి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అంతకుమించి ఏదీ లేదు అని నిత్యమీనన్ క్లారిటీ ఇచ్చింది(Nithya Menen)