Pawan Kalyan: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని నెంబర్ వన్ స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడం ఆయన అభిమానులను కొంత నిరాశపరిచిందని చెప్పాలి. అయితే అక్కడ ఆయన సక్సెస్ అవడం వారికి మరింత సంతోషాన్ని కలిగిస్తుంది. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎం గా బాధ్యతలను తీసుకున్నారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ముందుకు సాగుతుంది.
Pawan kalyan political and Film Career
అయితే ఎన్నికల కంటే ముందు పవన్ కళ్యాణ్ వరస సినిమాలను చేయగా వాటిలో మూడు సినిమాలు హోల్డ్ లో పెట్టాడు. కారణం ఏదైనా కూడా సదరు నిర్మాతలు ఆ చిత్రాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ కు విన్నపాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆ నిర్మాతల గురించి ఆలోచించి తన రాజకీయ కార్యకలాపాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆయా సినిమాలను పూర్తి చేయాలని, అందుకోసమే రాజకీయ కార్యకలాపాలను సరిదిద్దుతున్న సమయంలోనే ఈ సినిమాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడట.
Also Read: Team India: టీమిండియా ఆటగాళ్లకు 42 రోజులు సెలవులు ఇచ్చిన గంభీర్ !
వాస్తవానికి రాజకీయ జీవితంలో ఉన్నవారికి అసలు సమయం ఉండదు. ప్రజాసేవకే అంకితమైపోతారు కాబట్టి ప్రతిరోజు రాజకీయాలకు సంబంధించిన మీటింగ్లు దానికి సంబంధించిన సమావేశాలతోనే బిజీగా ఉంటారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నిర్మాతల కోసం ఆలోచించి ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను ఇప్పటికే పూర్తి చేయవలసి ఉండగా అది కొన్ని అనివార్య కారణాలవల్ల ఆగిపోయింది
అలాగే సుజిత్ దర్శకత్వంలోని ‘ఓజి’ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోవడంతో ఆ సినిమా నిర్మాతలు ఈ చిత్రాన్ని త్వరగా విడుదల చేయాలని అనుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేయగా ఆయన ఈ చిత్రం ఏడాదిలో పూర్తి చేస్తానని అన్నారు. అంతే కాకుండా ఈ సినిమాతో పాటే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయవలసిన సినిమా కూడా లైన్ లో ఉంది. దీనిని కూడా మొదలుపెట్టే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్స్ వేస్తున్నాడట. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయ కార్యకలాపాలలో ఉండగానే ఈ సినిమాలను పూర్తి చేయడం రెండు పడవలపై కాలు పెట్టినట్లే అని చెప్పాలి.