Prabhas to Work on Two Big Projects in 2025

Prabhas: వరుస పెద్ద సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న హీరో ప్రభాస్. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ఓ చిన్న సినిమాను చేయబోతున్నాడు. హారర్ సినిమాగా రాబోతున్న ‘రాజాసాబ్’ చిత్రంపై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కిన నేపథ్యంలో ఈ చిన్న సినిమా చేయడం పట్ల కొంతమంది నిరాశను వ్యక్తం చేసిన కూడా ప్రభాస్ ఈ విధమైన చిన్న సినిమాలు ఎక్కువగా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని ఇప్పుడు ఆయన సినిమాల లైనప్ బట్టి చెప్పవచ్చు.

Prabhas to Work on Two Big Projects in 2025

ఈ సినిమా తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాను చేయబోతున్నాడు ప్రభాస్. ఈ నెలలోనే ఈ చిత్రం మొదలు కాబోతూ ఉండగా ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతున్న ‘రాజాసాబ్’ చిత్రం యొక్క షూటింగ్ ఏడాది ఆఖరిలో పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభాస్ ఆ రెండు సినిమాలను ఒకేసారి చేయాలని భావిస్తున్నాడట.

Also Read: Chiranjeevi: చిరంజీవి ఆశలన్నీ విశ్వంభర పైనే!!

సందీప్ రెడ్డి దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేయడానికి ప్రభాస్ గతంలో ఒప్పుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి షూటింగ్ ను సందీప్ ఎప్పటినుంచో మొదలు పెట్టాలని భావిస్తున్న కూడా ప్రభాస్ డేట్లు దొరకకపోవడంతో ఆ చిత్రాన్ని చేయడానికి వీలుపడలేదు.. కాగా సందీప్ ఇటీవల ఆయనపై ఒత్తిడి పెంచడంతో ఈ సినిమాను ‘ఫౌజీ’ సినిమాకు ప్యార్లల్ గా చేయాలని ప్రభాస్ ఇప్పటికే చెప్పేసాడట. ఆ విధంగా వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలతో ఆయన బిజీగా ఉండబోతున్నాడని చెప్పవచ్చు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయవలసిన ‘సలార్ 2’ సినిమాను ఆపై వచ్చే ఏడాది చేయబోతున్నారు.