Allu Arjun: ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏ ఒక్క హీరో కూడా ఓకే సినిమా అని కాకుండా చేతిలో రెండు మూడు సినిమాలు పెట్టుకుంటున్నారు. ఆ విధంగా ఇతర హీరోలతో పోలిస్తే అల్లు అర్జున్ చేతిలో ఒకే ఒక సినిమా ఉందని చెప్పవచ్చు. ఆయన ప్రస్తుతం చేస్తున్న ‘పుష్ప2’ సినిమా తర్వాత చేయబోయే సినిమాను ఇప్పటిదాకా ఓకే చేయలేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.
Allu Arjun’s Sole Focus on Pushpa 2
ఈ సినిమా తర్వాత పెరిగిన అంచనాల నేపథ్యంలో ‘పుష్ప2’ సినిమా పట్ల ఎంతో జాగ్రత్త వహించి ఆ సినిమాను భారీ క్యాన్వాస్ లో రూపొందించడానికి చాలా ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు దర్శకుడు. ఆ విధంగా పలుమార్లు ఈ సినిమా యొక్క విడుదల వాయిదా పడుతూ పడుతూ వచ్చి డిసెంబర్లో విడుదల అవ్వడానికి ఇప్పుడు సిద్ధమైంది. అయితే కొన్ని షూటింగ్ అవాంతరాల వల్ల ఈ చిత్రం డిసెంబర్లో కూడా విడుదల రావట్లేదు అన్న విషయాన్ని కొంతమంది వెల్లడిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Prabhas: ఒకేసారి రెండు సినిమాలు చేయనున్న ప్రభాస్!!
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మాత్రం ‘పుష్ప2’ సినిమా కాకుండా మరే సినిమా చేయట్లేదని చెప్పాలి. కారణం ఏదైనా కూడా ఆయన దీంతో పాటే మరొక సినిమాను కూడా లైన్లో పెట్టుకోవాలి అని అందరూ చెబుతున్న మాట. అట్లీ దర్శకత్వంలో ఆయన తదుపరి సినిమా ఉండబోతుంది అని చెబుతున్న నేపథ్యంలో ఆ సినిమా ఎప్పుడు ఉంటుందో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఆ మధ్య బోయపాటి శ్రీను పేరు కూడా వినిపించింది. ఇప్పుడు ఆయన బాలకృష్ణ సినిమా చేయడానికి వెళ్లిపోవడంతో వీరి సినిమా ఇప్పట్లో లేదని అర్థమవుతుంది. మరి పుష్పను నమ్ముకున్న అల్లు అర్జున్ కు ఆ సినిమా ఎలాంటి ఫలితం తీసుకువస్తుందో చూడాలి.