Ram Charan High Remuneration Causing Delays for RC16

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు నిర్ణయించిన విషయం తెలిసిందే. డిసెంబర్ చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుండగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న తదుపరి సినిమా గురించి ఇటీవల ఒక అప్డేట్ వచ్చింది. RC16 గా తెరకెక్కుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. అని వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు వచ్చి చాలా రోజులు అయినా కూడా ఈ సినిమా ఇంకా మొదలు కాకపోవడం పట్ల మెగా అభిమానులు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Ram Charan High Remuneration Causing Delays for RC16

బుచ్చిబాబు దర్శకత్వంలో స్పోర్ట్స్ నేపథ్యం లో సినిమా చేయడానికి రామ్ చరణ్ గతంలో అంగీకరించిన విషయం తెలిసిందే. చాలా రోజుల పోస్ట్ ప్రొడక్షన్ పనుల తర్వాత ఈ సినిమా చేయడానికి రామచరణ్ అంగీకరించారు. చిత్రీకరణ కూడా ఈ నెలలోనే మొదలు కాబోతుంది అని వెల్లడించారు. కానీ ఈ సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ ఉండడం పట్ల కొంతమంది ఈ సినిమా చిత్రీకరణకు ఆలస్యం ఏంటో కనుక్కోవాలని ఆరా తీయగా ఈ సినిమా ఆలస్యం అవ్వడానికి కారణం రామ్ చరణ్ అనే అంటున్నారు.

Also Read: Venu Swamy: ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి అరెస్ట్.. చైశోభితా ఇష్యూ పై అయన అభిప్రాయం!!

గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ ను భారీ స్థాయిలో గెలిచారట. అందుకే ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు పెరిగిన క్రేజ్ దృష్ట్యా మరికొంత పారితోషకం రామ్ చరణ్ తదుపరి సినిమా కోసం పెంచారట. అందుకే నిర్మాతల వద్ద తన కొత్త రెమ్యునరేషన్ వివరాలు పెట్టగా ఆయనకు ఇంతటి స్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచిస్తున్నారట. రామ్ చరణ్ లాంటి హీరోతో సినిమా చేయడం మామూలు విషయం కాదు కాబట్టి నిర్మాతలు దానికి ఏమాత్రం ఆలోచించడం లేదట.

పైగా మైత్రి మూవీ మేకర్స్ వారు రామ్ చరణ్ తో ‘రంగస్థలం’ అనే సినిమా చేయగా దాని ద్వారా భారీ స్థాయిలోని వసూళ్లు రాబట్టారు వీరు. మరి ఈ వ్యవహారం ఎప్పుడు చక్కబడుతుందో చూడాలి. చాలా రోజులుగా తన అభిమాన హీరోను తెరపై చూడడానికి మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ హీరో ఈ సినిమాను ఎప్పుడు చేస్తారో చూడాలి. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బుచ్చిబాబు ఈ సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు దీనికి ఏ ఆర్ రెహమాన్ సంగీతని సమకూరుతున్నాడు.