Keerthy Suresh Struggling Despite Her Talent and Popularity

Keerthy Suresh: కొంతమంది హీరోయిన్లకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా అసలు క్రేజ్ రాదు. మంచి నటనతో ప్రేక్షకులను అలరించిన, తమ గ్లామర్ తో వారిని ఆకట్టుకున్న కూడా క్రేజ్ మాత్రం చాలా తక్కువగానే వస్తుంటుంది. అలాంటి టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు కీర్తి సురేష్. ఆమె మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరిస్తూ వచ్చింది. ఇటీవల గ్లామర్ షో కూడా మొదలు పెట్టి అభిమానులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలో అప్లోడ్ చేస్తూ కుర్రకారును ఎంతో రెచ్చగొడుతున్న కీర్తి సురేష్ గత కొన్ని రోజులుగా ఎక్కువ సినిమాలను చేయట్లేదని చెప్పాలి.

Keerthy Suresh Struggling Despite Her Talent and Popularity

మంచి విజయాలు అందుకున్న కూడా ఈమె సినిమా అవకాశాలను అందుకోవడంలో ఎందుకో విఫలమవుతుంది. ప్రస్తుతం ఆమె ఫోకస్ బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ వరుణ్ ధావన్ తో కలిసి ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ‘తేరీ’ సినిమాకు రీమేక్ గా రూపొందుతున్న ఈమెకు ఇప్పుడు మరొక భారీ అవకాశం వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రేక్షకులను ఎంతగానో అలరించి 1000 కోట్ల క్లబ్ లోకి చేరగా ఈ సినిమా రెండవ భాగంలో ఆమెకు ఓ కీలకపాత్ర దర్శకుడు ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది.

Also Read: Prabhas: ఒకేసారి రెండు సినిమాలు చేయనున్న ప్రభాస్!!

మొదటి భాగంలో బుజ్జి కి వాయిస్ ఓవర్ చెప్పిన కీర్తి సురేష్ ఇప్పుడు రెండవ భాగంలో ఓ కీలక పాత్ర పోషిస్తుందట. అది ఎలాంటి పాత్రలో తెలియాలి అంటే ఈ సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే. ఆమెతో కలిసి దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి అనే సినిమా చేయగా దానికి నేషనల్ అవార్డు వచ్చింది. కాగా ఇప్పుడు చేయబోయే ఈ సినిమా ద్వారా ఆమెకు తెలుగులో అవకాశాలు పెరుగుతాయా మనపటికంటే ఎక్కువ క్రేజ్ దక్కుతుందా అనేది చూడాలి.