Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ పార్టీని టార్గెట్ చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక ఆట ఆడుకుంటుంది.అయితే ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమినేతల్లో కుమ్ములాటలు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాలలో బిజెపి వర్సెస్ జనసేన అలాగే టిడిపి వర్సెస్ జనసేన.. మరికొన్నిచోట్ల టిడిపి వర్సెస్ బిజెపి అన్నట్లుగా కొనసాగుతున్నాయి. Pawan Kalyan

pithapuram varma warns pawan kalyan

ఏపీలోని ఏదో ఒకచోట పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే తాజాగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన.. అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది.జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పిఠాపురం వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. Pawan Kalyan

Also Read: Cm Reavanth Reddy: రేవంత్ రెడ్డి బిగ్ స్కెచ్.. కాంగ్రెస్ లోకి ఈటల?

ఎవరిని చెప్పినా తాను లోకల్ అని… వాళ్లంతా నాన్ లోకల్ అంటూ జనసేన ను ఉద్దేశించి పిఠాపురం వర్మ కామెంట్స్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దానికి సంబంధించిన ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. దీంతో పిఠాపురంలో జనసేన వర్సెస్ మధ్య గొడవలు జరుగుతున్నాయని అందరూ చర్చించుకుంటున్నారు. Pawan Kalyan

వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం… వర్మ చాలా కష్టపడ్డాడు. టికెట్ త్యాగం చేసి మరి పవన్ కళ్యాణ్ విజయం కోసం ప్రచారం చేశాడు. అలాంటి వర్మ కు ఇప్పుడు అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రతి విషయంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మాను జనసేన నేతలు అవమానిస్తున్నారట. ఈ తరుణంలోనే పిఠాపురం వర్మ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కొంతమంది చెబుతున్నారు. Pawan Kalyan