Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ కి నిన్న రోడ్డు ప్రమాదం జరిగిందనే వార్తలు చాలా వరకు రహస్యంగా ఉంచారు ఎన్టీఆర్ సన్నిహితులు.అయితే ఎంత దాచాలి అనుకున్న దాగదు కాబట్టి ఈ విషయం బయట వైరల్ అవ్వడంతో అసలు ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం జరిగిందన్న విషయాన్ని ఎందుకు దాచారు అని చాలామంది ఆలోచనలో పడ్డారు. మరి ఎన్టీఆర్ కి జరిగిన ప్రమాదం గురించి వార్తలను ఎందుకు మీడియాలోకి రానివ్వలేదు.. ఈ విషయాన్ని రహస్యంగా ఎందుకు ఉంచారు అనేది ఇప్పుడు చూద్దాం..
The reason for keeping the accident to Jr.NTR a secret
జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో రోడ్డు ప్రమాదానికి గురైనట్టు నిన్న వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. కానీ దీనిపై ఎన్టీఆర్ కి సంబంధించిన ఎవరూ కూడా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఎన్టీఆర్ యాక్సిడెంట్ అని సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వార్తలు ఒక్కసారి గా ఎక్కువ అవ్వడంతో దీనిపై ఎన్టీఆర్ పి ఆర్ టీం క్లారిటీ ఇస్తూ.. ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.ఆయన జిమ్లో వర్కౌట్ చేసే సమయంలో మణికట్టు దగ్గర చిన్న దెబ్బ తాకింది అది చిన్న గాయమే. (Jr.NTR)
Also Read: Rana: రానా మిహికా లవ్ స్టోరీ.. కలిసిన వారానికే పెళ్లా..?
చిన్న గాయం కాబట్టే దేవర సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నారు.దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ ఎన్టీఆర్ పి ఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ఇక పి ఆర్ టీమ్ క్లారిటీతో ఎన్టీఆర్ అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.కానీ సోషల్ మీడియాలో మాత్రం మరో వార్త వినిపిస్తోంది. ఎన్టీఆర్ కి జిమ్లో దెబ్బ తగలలేదని,ఆయన కారు ప్రమాదానికి గురయ్యారని,కానీ ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు రహస్యంగా ఉంచుతున్నారని,దానికి ప్రధాన కారణం గతంలో కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు..
ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీకి రోడ్డు ప్రమాదాలకు దగ్గరి సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, అన్న జానకిరామ్ ఇద్దరూ రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. అలా ఈయనకి కూడా ఏదైనా ప్రమాదం ఉందేమోనని అభిమానులు భయపడతారనే ఉద్దేశంతో ఈ వార్తను బయటికి రానివ్వలేదని తెలుస్తుంది.(Jr.NTR)