Peddireddy Ramachandra Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతోంది. అడుగడుగునా ఆయనకు… అంతరాయం కలిగిస్తోంది ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. Peddireddy Ramachandra Reddy

peddireddy ramachandra reddy by elections in punganoor

అంతేకాదు గతంలో పెద్దిరెడ్డి కుటుంబం పైన ఉన్న కేసుల వివరాలన్నీ బయటకు తీస్తోంది. ముఖ్యంగా మైనింగ్ కేసులను బయటకు తీసి… పెద్దిరెడ్డి ని జైల్లో వేయాలని కూటమి సర్కార్ ఎన్నో స్కెచ్ లు వేస్తోంది. అంతేకాకుండా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం అడుగుపెట్టకుండా… నాన రచ్చ చేసింది టిడిపి. Peddireddy Ramachandra Reddy

Also Read: Revanth Reddy: స్వాతంత్ర్య దినోత్సవం నాడు తెలంగాణ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రేవంత్!!

దీంతో పెద్దిరెడ్డి ఎప్పుడు అరెస్టు అవుతాడో అనే భయం అందరిలోనూ ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పెద్దిరెడ్డికి చుక్కెదురైంది. ఆయన ఎన్నికల అఫీడవిట్ లో తప్పుడు ఆస్తులు చూపించారని పుంగనూరు టిడిపి అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసు విచారణ చేసిన ఏపీ హైకోర్టు… పెద్దిరెడ్డి పైన చర్యలు తీసుకుంటే తప్పు లేదని పేర్కొంది. Peddireddy Ramachandra Reddy

పుంగనూరు నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు అందరికీ నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఇక ఈ కేసును వచ్చే నెలకు వాయిదా వేశారు. అయితే ఏపీ హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో పెద్దిరెడ్డి… పదవి పోయే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే పుంగనూరులో మళ్లీ ఎన్నికలు జరగడం ఖాయమని ఏం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. Peddireddy Ramachandra Reddy