KTR: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… ప్రజలు చాలా అసంతృప్తిగా కనిపిస్తున్నారు. ప్రతి పథకంలో కూడా..కోతలు విధిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం… తాగునీరు అలాగే సాగునీరు అందించడంలో విఫలమవుతోంది. కరెంటు కూడా సరిగా ఉండడం లేదు. KTR
KTR vs seethakka Ellipayala Panchayat in Telangana
కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… ఒక ఫ్రీ బస్సు పథకాన్ని మాత్రం.. పూర్తిస్థాయిలో నడుపుతోందని చెప్పవచ్చు. కానీ చాలా వరకు బస్సులను తగ్గించి ఈ పథకాన్ని నడిపిస్తున్నారట. అయితే దీనిపై గులాబీ పార్టీ నిత్యo విమర్శలు చేస్తూనే ఉంది. అంతేకాకుండా ఫ్రీ బస్సు లో చాలామంది మహిళలు… ప్రయాణించి బీడీలు చేయటం, జుట్లు వేసుకోవడం, ఎల్లిపాయ పొట్టు తీయడం లాంటివి చేస్తున్నారు. KTR
Also Read: Cm Revanth Reddy: చంద్రబాబు ఇజ్జత్ తీసిన రేవంత్ రెడ్డి..?
అయితే వీటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసింది గులాబీ పార్టీ. అయితే దీనిపై తాజాగా మంత్రి సీతక్క స్పందించారు. అదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే నాలుగు గంటల సమయం పడుతుంది.. ఆ సమయంలో ఖాళీగా ఉండలేక కొంతమంది బీడీలు చేస్తున్నారు… కొంతమంది.. ఎల్లిపాయ పొట్టు తీస్తున్నారని సీతక్క వెల్లడించారు.KTR
అయితే అందులో ఎలాంటి తప్పు లేదని సీతక్క మాట్లాడారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. అలా పనులు చేసుకోవడం తప్పు కాదని… బస్సులు పెంచాలని కోరాడు. బస్సులు పెంచిన తర్వాత మహిళలు బ్రేక్ డాన్సులు చేసిన తప్పు లేదన్నారు. అయితే కేటీఆర్ చేసిన ఈ కామెంట్స్ పై సీతక్క మళ్ళీ కౌంటర్ ఇస్తున్నారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎల్లిపాయల పంచాయతీ తెలంగాణలో నెలకొంది. KTR