KCR: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య… మాటల యుద్ధం కొనసాగుతోంది. గులాబీ పార్టీని… నాశనం చేసేందుకు రేవంత్ రెడ్డి అనేక స్కెచ్ లు వేస్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను 10 మందిని జాయిన్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. KCR
KCR as Governor of Telangana KTR and Harish as Union Minister
అయితే ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి గులాబీ పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే గులాబీ పార్టీ….బిజెపి పార్టీలో విలీనం కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే భారతీయ జనతా పార్టీలో గులాబీ పార్టీ… కేసీఆర్ కుటుంబానికి బంపర్ ఆఫర్లు ఇచ్చారని ఈ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. KCR
Also Read: KTR: తెలంగాణలో ఎల్లిపాయల పంచాయితీ?
ముఖ్యంగా నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపి పార్టీలో చేరబోతున్నారని… ఆ పార్టీ విలీనం కాబోతుందని తెలిపారు. అయితే దీని ఫలితంగా కెసిఆర్ కు తెలంగాణ గవర్నర్గా పదవి ఇస్తారని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే కేంద్రమంత్రిగా కేటీఆర్ కు అవకాశం ఇస్తారని ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. KCR
అటు నలుగురు ఎంపీలు చేరినందుకు గాను కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందని తెలిపారు. ఇక కెసిఆర్ అల్లుడు హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారని కూడా బాంబు పేల్చారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఢిల్లీలో చిట్ చాట్ లో పేర్కొనడం జరిగింది. దీంతో గులాబీ పార్టీ రేవంత్ రెడ్డి పై ఫైర్ అవుతోంది. రేవంత్ రెడ్డి ఎన్ని వ్యాఖ్యలు చేసిన తెలంగాణ కోసం మాత్రమే గులాబీ పార్టీ పనిచేస్తుందని తెలిపారు కల్వకుంట్ల తారక రామారావు. KCR