I can't imagine that movie without Prabhas.. CM's interesting comments

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేంజ్ ఏ లెవెల్ కి వెళ్ళిందంటే సీఎం, పీఎం లు కూడా కొనియాడే స్థాయికి. ఈయన ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే మనస్తత్వతో హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేసినా కూడా ఆయనలో ఇసుమంతైనా గర్వం ఉండదు. నేను పెద్ద హీరోని వీరంతా నా ముందు ఎంత అనే భావన ఎప్పుడూ కూడా చూపించరు. అంతేకాకుండా ఆయన 5,6 వందల కోట్ల బడ్జెట్ పెట్టే సినిమాలలో చేస్తూనే ఓవైపు మారుతి వంటి చిన్న డైరెక్టర్ తో రాజా సాబ్ మూవీలో నటించడానికి ఒప్పుకున్నారు.

I can’t imagine that movie without Prabhas.. CM’s interesting comments

అయితే కొంత మంది హీరోలు ఒక రేంజ్ కి వెళ్ళాక చిన్న దర్శకులతో సినిమాలు చేయడానికి అస్సలు ఒప్పుకోరు.అది ఎంత మంచి కథ అయినా సరే రిజెక్ట్ చేస్తారు.కానీ ప్రభాస్ మాత్రం అలా కాదు. ఆయన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు. అయితే అలాంటి ప్రభాస్ ని తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తాజాగా క్షత్రియ సేనాసమితి హైదరాబాదులో ఒక సభ నిర్వహించారు. ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చిన రేవంత్ రెడ్డిని వాళ్లు సన్మానించారు.(Prabhas)

Also Read: Nithiin: నోరు మూసుకో లేదంటే నీ అంతు చూస్తా.. నితిన్ కి వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్.?

అయితే ఈ సన్మానం అయిపోయాక అక్కడికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ.. ప్రభాస్ ని చాలా గొప్పగా పొగిడారు.. హాలీవుడ్ తో పోటీపడే సత్తా ఉండి టాలీవుడ్,బాలీవుడ్ ని దాటి హాలీవుడ్ మూవీస్ తో పోటీపడిన మన బాహుబలి ప్రభాస్..బాహుబలి సినిమాలో ప్రభాస్ ని లేకుండా సినిమాని ఊహించుకోలేం. క్షత్రియులు ఏ రంగంలో ఉన్నా కూడా సక్సెస్ అవుతారు.మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే కృష్ణంరాజు పేరు చెప్పకుండా ఉండలేము. ఆయన పేరు కచ్చితంగా వినిపిస్తుంది..

 I can't imagine that movie without Prabhas.. CM's interesting comments

అయితే ప్రస్తుతం ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరమైన విషయం.. అలాగే ఆర్జీవి వంటి వాళ్లు ఒకప్పుడే బాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలారు..అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మా హీరో ని పొగిడారు అంటూ ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేస్తూ తెగ సంబర పడుతున్నారు.(Prabhas)