Ram Pothineni: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీ తో ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ పోతినేని ఈ సినిమాతో యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ సినిమా బాగుండడంతో ఈ సినిమాకి సీక్వల్ గా రాబోతుంది కాబట్టి బ్లాక్ బస్టర్ అవుతుందని అందరు భావించారు. కానీ ఇస్మార్ట్ శంకర్ మూవీ లెవెల్ లో ఈ సినిమా లేదని అందరి అభిప్రాయం. అలాగే పూరి దర్శకత్వం పట్టాలు తప్పుతుంది అని,పూరికి చిప్ దొబ్బింది అంటూ ఇలా ఎంతోమంది ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
Ram Pothineni has not spoken to his close friend for six months.. the reason
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో కూడా చాలామంది అనుమాన పడుతున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే రామ్ పోతినేని తన క్లోజ్ ఫ్రెండ్ తో దాదాపు ఆరు నెలలు మాట్లాడలేదట.మరి ఆయన ఎందుకు అలా చేశారు.. ఏమైనా గొడవలు జరిగాయా అనేది ఇప్పుడు చూద్దాం. డబుల్ ఇస్మార్ట్ మూవీ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రామ్ మాట్లాడుతూ.. నేను నా బెస్ట్ ఫ్రెండ్ తో కూడా ఆరు నెలలు మాట్లాడని సందర్భాలు ఉన్నాయి. (Ram Pothineni)
Also Read: Heroine: ఒక్క నైట్ కి 4 కోట్లు.. వ్యభిచా** చేస్తూ దొరికిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..?
అయితే ఏదైనా గొడవ జరిగితే అలా మాట్లాడలేదు కావచ్చు అని మీరందరూ అనుకుంటారు.కానీ అది కావాలని చేసింది కాదు.అనుకోకుండా అలా ఆరు నెలల సమయం పట్టింది. నేను నా స్నేహితుల కంటే ఎక్కువగా ఇంట్లోనే చిల్ అవుతాను. అందుకే ఎక్కువగా బయటకు వెళ్ళను. కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నాతో ఉండడానికి ఇష్టపడతారు.ఇక నేను ఏ నిర్ణయం అయినా సరే క్షణాల్లో తీసుకుంటాను.ఒకవేళ నాకు ఎటైనా విదేశాలకు వెళ్లాలి అనిపిస్తే కారులో అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తా.. అలా వెళ్తూ కారులో వెళ్తున్న సమయంలోనే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకుంటాను.
అలా చేసి కొన్ని కొన్ని సార్లు లగేజ్ కూడా మిస్ అయ్యాను. అయితే నా ఫ్రెండ్స్ ని ఆరు నెలలకు ఒకసారి అయినా లేదా ఆ లోపైన కలుస్తాను. ఒకవేళ నాకు నా ఫ్రెండ్స్ ని కలవాలనిపిస్తే వాళ్ళు బయట దేశాల్లో ఉన్నా కూడా అప్పటికప్పుడే ఓ డెసిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాను. గతంలో నా ఫ్రెండ్ ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటే వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. అలా నేను ఏ నిర్ణయమైనా క్షణాల్లోనే తీసుకుంటాను.దాని గురించి రోజుల తరబడి అస్సలు ఆలోచించను.అలాగే ఇండియాలో సినిమాలు చూడను కాబట్టి విదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా థియేటర్లలో సినిమాలు చూస్తాను అంటూ రామ్ పోతినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.(Ram Pothineni)