Savitri: మహానటి సావిత్రి జీవితంలో మనకు తెలియని ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. అయితే ఆమె బయోపిక్ గా తెరకెక్కిన మహానటి సినిమాలో మనం చూసింది కొద్దివరకే. ఇంకా తెలియని విషయాలు తెలవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిని తెరమీద చూపిస్తే గొడవలు అవుతాయి అనుకున్నారో ఏమో కానీ కొద్ది వరకు మాత్రమే ఆ సినిమాలో చూపించారు. ఇక మహానటి సినిమా ద్వారా సావిత్రి పిల్లలకు జెమినీ గణేషన్ పిల్లలకు గొడవలు అయ్యాయి అనే సంగతి కూడా సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి తెలిపింది. అయితే మహానటి సినిమాలో నాగ్ అశ్విన్ కొన్ని లేని విషయాలను కూడా కల్పించి చూపించారట.
Will you shed tears if you see these dark days in Savitri life
అలాంటి దానిలో ఒకటి మహానటి మూవీలో సావిత్రి తన తల్లి సన్నిహితంగా ఆమె ఇంట్లోనే ఉంటుంది.కానీ రియల్ లైఫ్ లో మాత్రం సావిత్రితో అంతా బంధం మెయింటైన్ చేయలేదట.ఆమె చాలా రోజులు సావిత్రికి దూరంగానే ఉందట. అలాగే సావిత్రి సవతి తండ్రి వల్ల ఎన్నో ఇబ్బందులు పడిందట. కానీ ఈ విషయాన్ని ఇందులో చూపించలేదు. అలాగే తన బాధలన్నింటిని పోగొట్టుకోవడం కోసం తనకొక తోడు కావాలి అని ఆ తోడు జెమినీ గణేషన్ వల్ల వస్తుంది అని నమ్మి పెళ్లి చేసుకున్నప్పటికీ ఆమె బంధం నిలబడలేదు. భాగస్వామి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడింది. ఇక ఈ సినిమాలో చూపించని మరో అంశం ఓ రాజకీయ నాయకుడు.. (Savitri)
Also Read: Prabhas: ప్రభాస్ లేకుండా ఆ సినిమాని ఊహించుకోలేం.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..!!
అసలు విషయం ఏమిటంటే.. సావిత్రి బతికున్న సమయంలో స్టార్ గా రాణించినప్పుడు ఓ పాపులర్ పొలిటీషియన్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడట.దాంతో అది సహించలేని సావిత్రి గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట.అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చాక సావిత్రి పై చాలా పగ పెంచుకొని ఇన్కంటాక్స్ దాడులు చేయించి ఆమె ఆస్తులన్ని జప్తు చేయించాడు. ఈ విషయాన్ని కూడా ఇందులో చూపించలేదు. అలాగే చెన్నైలో ఒక వీధి మొత్తం సావిత్రి పేరు మీదనే ఇండ్లు ఉండేవట. అంతేకాదు ఆమె ఎంతోమంది పేదవాళ్ళకి గోన సంచులలో డబ్బులు తీసుకువచ్చి మరీ పంచిపెట్టేదట.
కానీ ఆమె చేత సహాయం పొందిన వాళ్ళు ఎవరు కూడా సావిత్రి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆమెను పట్టించుకోలేదు. కనీసం పాపం అని కూడా అనలేదట. అంతేకాదు బయటి వాళ్లు అంటే ఏమో కానీ సావిత్రి సొంత కూతురు కూడా డబ్బు కోసం నా ఇంటికి రాకు అని తిట్టిందట. కానీ సావిత్రి మాత్రం తన కూతురిని బాగా డబ్బున్న వ్యక్తికి అప్పట్లోనే ఎన్నో ఆస్తులు కట్నం గా ఇచ్చి పెళ్లి చేసిందట. చివరి రోజుల్లో సావిత్రి ని విజయ చాముండేశ్వరి దగ్గరికి తీయలేదట కానీ సావిత్రి మరణించిన సమయంలో మాత్రం అందరికంటే ముందు ఆస్తి కోసం వచ్చిందట. ఈ విషయాన్ని కూడ మహానటి మూవీలో చూపించలేదని ఈ సినిమా చూసిన కొంతమంది మాట్లాడుకున్నారు.(Savitri)