Kushboo: స్టార్ హీరోయిన్ కుష్బూ నిజంగానే ఆ హీరోని సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకుందా.. కుష్బూకి డైరెక్టర్ నటుడు అయినటువంటి సుందర్ సి మొదటి భర్త కాదా.. ఆయన రెండో భర్తనా.. ఇంతకీ కుష్బూ ఎవరిని పెళ్లి చేసుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. కుష్బూ పేరు చెప్పగానే తమిళ ప్రేక్షకులు అందరికీ నటుడు ప్రభు పేరు గుర్తుకొస్తుంది.ప్రభు కుష్బూ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి.
Kushboo wanted to be the second wife of that hero
అంతే కాదు వీరిద్దరూ ప్రేమలో పడి సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారట. అయితే ప్రభుకి అప్పటికే పెళ్లయ్యింది..కానీ వీరు సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకుంటున్నారు అనే విషయం తెలియగానే ప్రభు తండ్రి శివాజీ గణేషన్ అస్సలు ఒప్పుకోలేదట. కానీ కుష్బూ ప్రభు మాత్రం గాఢంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని చూసారట. (Kushboo)
Also Read: Kavya Thaper: ఆ హీరోతో డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ డేటిం**..?
అలా ఓ రోజు నేరుగా కుష్బూ ప్రభు ఇంటికి వెళ్లి వారి ఇంట్లోనే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారట. అయితే ఈ విషయం తెలిసి ప్రభు మొదటి భార్య గోల గోల చేయడంతో ఇది కాస్త రోడ్డుకెక్కింది.. అయితే ప్రభు మొదటి భార్య గొడవలు ఎక్కువ అవ్వడంతో కుష్బూ, ప్రభు ల మధ్య బంధం ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అలా పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే ప్రభుకి డివోర్స్ ఇచ్చేసింది. అలా ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రభు కుష్బూల బంధం పెళ్లైన నాలుగు నెలల్లోనే తెగిపోయింది.
ఆ తర్వాత ఎంతో డిప్రెషన్ లోకి వెళ్లిన కుష్బూకి డైరెక్టర్ నటుడు అయినటువంటి సుందర్. సి పరిచయమయ్యాడు. కుష్బూ పరిస్థితి తెలుసుకున్న సుందర్ సి ఆమెను ఓదార్చాడు. అంతేకాదు ఓ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మరింత సాన్నిహిత్యం పెరిగి సుందర్ కుష్బూని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అలా కుష్బూ మొదటి ప్రేమ పెళ్లి తెలిసిన కూడా సుందర్ సి ఆమెను భార్యగా అంగీకరించాడు. అలా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.(Kushboo)