Ramoji Rao: ఈనాడు అధినేత రామోజీరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పచ్చళ్ళ తయారీ కంపెనీ నుంచి ఈనాడు అధినేత వరకు రామోజీరావు ఎదిగారు. అంతే కాదు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా… పేరు సంపాదించుకున్నారు రామోజీరావు. అయితే ఇటీవల రామోజీరావు తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో నెల రోజుల కిందట రామోజీరావు మృతి చెందడం జరిగింది. Ramoji Rao

Gannavaram Airport named after Ramoji Rao

ఇక రామోజీరావు మరణం అనంతరం… ఆయన అంతక్రియలను అధికారికంగా నిర్వహించారు. ఇటు ఏపీ ప్రభుత్వం… రామోజీరావు సంతాప సభను అధికారికంగా కూడా నిర్వహించడం జరిగింది. చంద్రబాబు కష్ట కాలంలో ఉన్నప్పుడు రామోజీరావు… ఆయన వెంట ఉన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి.. ఇప్పటివరకు చంద్రబాబు కోసమే రామోజీరావు పని చేయడం జరిగింది. Ramoji Rao

Also Read: Konda Vishweshwar Reddy: కాంగ్రెస్ లోకి BJP ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి?

ఈ తరుణంలోనే రామోజీరావుకు ప్రత్యేక.. గుర్తింపు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నిత్యం కృషి చేస్తున్నారు. మొన్న ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణం కూడా… రామోజీరావు అని చెబుతున్నారు. Ramoji Rao

అయితే తాజాగా రామోజీరావు విషయంలో చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏపీలోని గన్నవరం ఎయిర్పోర్ట్ కు రామోజీరావు పేరు పెట్టాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంలో చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఏ క్షణమైనా దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. Ramoji Rao